విమర్శించిన నోళ్ళే పవన్ ని మెచ్చుకుంటున్నాయి

పవన్ కళ్యాణ్ అంటే తపన ఉన్న వారు. అది ఆయన సన్నిహితులకు మాత్రమే ఇప్పటిదాకా తెలిసిన విషయం.

Update: 2024-09-17 03:29 GMT

పవన్ కళ్యాణ్ అంటే తపన ఉన్న వారు. అది ఆయన సన్నిహితులకు మాత్రమే ఇప్పటిదాకా తెలిసిన విషయం. ఆయన ప్రజా నాయకుడిగా మారి ఈ రోజున అధికారంలోకి వచ్చక పవన్ అంటే అందరికీ తెలిసి వస్తోంది. ఒక రాజకీయ నాయకుడు ఏకంగా ఆరు కోట్ల విరాళం ఇవ్వడం వర్తమాన రాజకీయ చరిత్ర అయితే ఎరగదు. అది ఒక్క పవన్ కళ్యాణ్ తోనే సాధ్యపడింది.

పవన్ కళ్యాణ్ అంటేనే అది అని తన మార్క్ ని ఆయన అలా రుజువు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కి ప్రజలు అంటే ఇష్టం అని మరో మారు అలా చాటి చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇటీవల వచ్చిన వరదల పట్ల చలించిపోయి రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో కోటి వంతున తన సొంత కష్టాన్ని ఇచ్చారు. అంతే కాదు మరో నాలుగు కోట్ల రూపాయలు ఆయన తాను ఎంతో ఇష్టపడిన పంచాయతీలు వరదల వల్ల నష్టపోయిన తీరును చూసి ఇచ్చారు. అలా వరద ప్రభావం చూపించిన నాలుగు వందల పంచాయతీలకు తలో లక్ష పవన్ ద్వారా అందింది.

ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం ఆర్రులు చాచి చూసే పంచాయతేలకు ఈ లక్ష చాలా పెద్ద మొత్తమే అని చెప్పాలి. దీంతో ఎంతో కొంత అభివృద్ధి పనులు జరుగుతాయి. ఆ విధంగా తాను అందరి కంటే భిన్నమైన రాజకీయ నాయకుడిని అని పవన్ ఇప్పటికే రుజువు చేసుకున్నారు. అంతే కాదు ఆయన చూస్తున్న పంచాయతీ రాజ్ శాఖలో ఒకేసారి ఏకంగా 13 వేల 500 పై దాటిన పంచాయతీల గ్రామ సభలను నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డుని సాధించారు.

ఇది కూడా ఒక్క పవన్ కే సాధ్యమైన రికార్డుగా చూడాలి. పవన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం మూడు నెలల సమయం మాత్రమే అయింది ఇంతలోనే ఆయన తన ముద్రను బలంగా ఆ శాఖ మీద వేయగలిగారు. అంతే కాదు ఏపీ పంచాయతీలకు ప్రపంచ గుర్తింపును అలా తెచ్చారు. పవన్ అంటే సాధారణంగా పవర్ స్టార్ అని అంటారు.

ఆయనకు సినీ రంగంలో రికార్డులకు కొదవ లేవు. ఆయన ఎన్నో అలాంటివి సాధించారు. కానీ ఆయన ఎంతో మక్కువ చూపించి వచ్చిన రాజకీయ రంగంలో ఈ రకంగా రికార్డులను సాధించడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. పవన్ రాజకీయాల్లోకి వచ్చి ఏమి చేస్తారు అన్న వారికి ఆయనను విమర్శించిన వారికి మౌనంగా పవన్ ఇచ్చే జవాబుగా దీనిని చూడాలి.

అందుకే పవన్ ని అదే పనిగా విమర్శించిన ప్రత్యర్థులు కూడా డిప్యూటీ సీఎంగా పవన్ పని చేస్తున్న తీరు ఆయన చవకబారు విమర్శలకు దూరంగా ఉంటున్న విధానం అధికారం చేతిలో ఉంచుకుని కూడా ఏ విధంగా ఉండాలి అన్న ఆయన సంయమనం అన్నీ చూసి వారికి వారే మారిపోయారు. వారి మనసులను కూడా అలా గెలుచుకున్న పవన్ నిజంగా ప్రజా నేతగా విజేతగా ఉన్నారు. పవన్ ని పొగడడం అని కాదు కానీ పాత తరం నాయకులను ఆయన గుర్తుకు తెస్తున్నారు.

ఒక ప్రకాశం, ఒక వావిలాల గోపాలకృష్ణ వంటి వారికి పదవుల మీద ఆసక్తి ఉండేది కాదు, పవన్ కూడా ఆనాటి నాయకుల కోవలోనే ప్రజలు అంటే తపిస్తున్నారు ఆయన ఇదే తీరున మరిన్ని విజయాలు ఇంకా కొత్త రికార్డులు రాజకీయాల్లో సాధించాలని అంతా కోరుకుంటున్నారు. ఏపీకి నాయకుల కొరత చాలా ఉంది. అందులో జన నేతల కొరత మరీ ఎక్కువగా ఉంది. పవన్ ఆ లోటుని భర్తీ చేస్తారన్న ఆశ చాలా మందిలో ఉంది.

Tags:    

Similar News