అలీ పొలిటికల్ నిర్ణయం వెనుక పవన్?
దీంతో పవన్ సూచనల మేరకే.. అలీ రాజకీయాల నుంచి తప్పుకొన్నారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే.. వైసీపీలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా అలీ సాధించిందేమీ లేదు.
హాస్యనటుడు అలీ.. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు కొన్నాళ్ల కిందట ప్రకటించిన విషయం తెలి సిందే. తనే స్వయంగా సెల్ఫీ వీడియో తీసుకుని.. మరీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాను ఏ పార్టీలోనూ ఉండేది లేదని.. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా తాను ఎలా రాజకీయాల్లోకి వచ్చాననే విషయాన్ని చెప్పారు. కానీ, ఈ సందర్భంగా ఏ పార్టీపైనా.. ఏ నాయకుడిపై నాఅలీ విమర్శలు చేయలేదు.
అయితే.. అంత సడెన్‌గా అలీ రాజకీయాల నుంచిఎందుకు తప్పుకొన్నారనేది ఇప్పటికీ సందేహమే. వైసీపీపై అభిమానం లేకో.. మాజీ సీఎం జగన్‌పై అభిమానం లేకో.. ఆయన ఇలా తప్పుకున్నారా? అంటే అదేమీ కాదు. అదే నిజమైతే.. ఆయన ఆ విషయాన్ని అప్పట్లలోనే చెప్పేవారు. కానీ, వాస్తవం ఏంటి? అనేది మాత్రం వెల్లడించలేదు. అయితే.. తాజాగా ఓ రియాల్టీ షోలో షోలో పాల్గొన్న అలీ.. తనకు పవన్ కల్యాణ్ అంటే.. ఇష్టమని.. ఆయనకు తాను వీరాభిమానని వ్యాఖ్యానించడం గమనార్హం.
దీంతో పవన్ సూచనల మేరకే.. అలీ రాజకీయాల నుంచి తప్పుకొన్నారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే.. వైసీపీలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా అలీ సాధించిందేమీ లేదు. కానీ, సినీ ఇండస్ట్రీలో మాత్రం కొన్ని కొన్ని అవకాశాలను తనకు తెలియకుండానే మిస్ చేసుకున్నారు. వీటిపైనా ఆయనకు మానసికంగా ఇబ్బంది ఉంది. అయితే.. ఏనాడూ బయట పడలేదు.
ఇక, వైసీపీ అధికారం కోల్పోవడంతో.. అలీ తప్పుకొన్నారు. కానీ, ఈ నిర్ణయం వెనుక.. పవన్ సూచనలు ఉండి ఉంటాయనడానికి అంటున్నారు. ఏమాత్రం తడుము కోకుండా.. పవన్ తనకు ఎంతో ఇష్టమని చెప్పడంవెనుక అలీ తీసుకున్న నిర్ణయం దాగి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా.. రాజకీయాల్లో అలీ.. ఒక నిశ్శబ్ద మెరుపు!!