గమనించారా? కీలక రివ్యూ వేళ బాబు చేయనిది పవన్ చేశారట!

తన మాటలతో చంద్రబాబు బాటలో నడుస్తామన్న సందేశానని క్లియర్ గా చెప్పటం ద్వారా.. తాను సైతం చంద్రబాబు బాటనే ఫాలో అవుతానన్న విషయాన్ని స్పష్టం చేశారు.

Update: 2024-08-06 06:30 GMT

గతానికి భిన్నంగా చంద్రబాబు చాలానే మారారు. అధికారం చేతికి వచ్చినంతనే ఆయన మాట తీరులోనూ.. చేతల్లోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. చాలా విషయాల్లో మారినా.. ఇప్పటికి కొన్ని విషయాల్ని మిస్ అవుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు గంటల కొద్దీ రివ్యూ భేటీలకు కేటాయించేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా రివ్యూ భేటీలు గంటల కొద్దీ ఉండవన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అంతేకాదు.. గతంలో తన గొప్పల గురించి ఎక్కువ సమయాన్ని కేటాయించేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా సమస్యలు.. వాటికి పరిష్కారాలు.. తన ఆలోచనలు.. ఉన్న అవకాశాలు.. పెట్టుకున్న లక్ష్యాలు.. వాటి సాధనకు ఏం చేయాలన్న దానిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే గతంతో పోలిస్తే చంద్రబాబులో చాలానే మార్పు వచ్చింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత.. తాను పాల్గొన్నప్రతి కీలక సమావేశంలోనూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తావనను తీసుకొచ్చేవారు చంద్రబాబు. తాజాగా నిర్వహించిన జిల్లా లెక్టర్లు.. జిల్లా ఎస్పీలతో నిర్వహించిన రివ్యూ భేటీలో మాత్రంఆయన పవన్ ప్రస్తావన చేయలేదు. అయితే.. పవన్ మాట్లాడే సమయంలో మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు.

తన మాటలతో చంద్రబాబు బాటలో నడుస్తామన్న సందేశానని క్లియర్ గా చెప్పటం ద్వారా.. తాను సైతం చంద్రబాబు బాటనే ఫాలో అవుతానన్న విషయాన్ని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ చేసినట్లే.. చంద్రబాబు సైతం తన ప్రసంగంలో ఏదో ఒక సందర్భంలో పవన్ ప్రస్తావన తీసుకొచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘‘చంద్రబాబు అనుభవం.. పాలన దక్షతతో రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొద్దాం’’ అంటూ పవన్ చేసినట్లుగా.. జనసేనాని ప్రస్తావనను సీఎం చంద్రబాబు తీసుకొచ్చి ఉంటే బాగుండేదంటున్నారు. ప్రతి సందర్భంలోనూ పవన్ ప్రస్తావన తెచ్చే సీఎం చంద్రబాబు ఈసారి ప్రస్తావించకపోవటాన్ని భూతద్దంలో పెట్టి చూడటం సబబు కాదంటున్నారు. ప్రతి సందర్భంలోనూ ప్రస్తావించాలన్న రూల్ లేదని.. అవసరాన్ని బట్టి ప్రస్తావించటమే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News