అంతా వర్మమయం..పిఠాపురంలో పవనిజం !
రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లుగా కాపులు ఎక్కువగా అక్కడ ఉన్నారని పవన్ పోటీకి దిగుతున్నారని అంటారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగినా చివరి నిముషం వరకూ సస్పెన్స్ లో ఉంచేశారు. అయితే కొద్ది రోజుల క్రితమే పవన్ దాన్ని రివీల్ చేశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడానికి కారణాలు ఏమిటి అంటే లాజిక్ కి అందనివే అన్నీ కనిపిస్తాయి.
రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లుగా కాపులు ఎక్కువగా అక్కడ ఉన్నారని పవన్ పోటీకి దిగుతున్నారని అంటారు. ఆ మాటకు వస్తే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీత కూడా కాపుల ఆడపడుచు కదా. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. ఒక్క వర్మ తప్ప దశాబ్దాలుగా గెలుస్తున్న వారంతా కాపులే.
మరి ఈ పాయింట్ తో పవన్ అక్కడ గెలుస్తారా అనుకుంటే ఆపోజిట్ క్యాండిడేట్ వేరే సామాజిక వర్గం అయినపుడే వర్కౌట్ అవుతుంది. సో ఇది కాదు, మరేమిటి అంటే జనాభిమానం అంటారు. అది ఉంటే పిఠాపురం దాకా ఎందుకు రావాలి. భీమవరం గాజువాక సహా ఏపీలో అన్ని చోట్లా పవన్ కి విపరీతమైన జనాదరణ ఉంది కదా అని కూడా డౌట్లు వస్తాయి.
అలాగే 2019లో జనసేన పెర్ఫార్మెన్స్ చూసి అని అనుకుంటే 28 వేల ఓట్లు మాత్రమే జనసేనకి వచ్చాయి. థర్డ్ ప్లేస్ లో ఆ పార్టీ ఉంది. గాజువాక భీమవరంలలో జనసేన సెకండ్ ప్లేస్. అంటే రన్నర్ గా ఉంది అన్న మాట. రన్నర్ నుంచి విన్నర్ అవడం సులువు. మరి థర్డ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్ లోకి ఎగబాకడం అంటే కష్టమైన విషయమే అని అంటారు.
ఇవన్నీ ఇలా ఉంటే పవన్ ఎందుకు ఏ ధైర్యంతో పిఠాపురం ఎంచుకున్నారు అంటే అక్కడ స్టాంగ్ గా టీడీపీ ఉంది. జనసేన వారూ ఉన్నారు. ఈ రెండు మిక్స్ అయితే విజయం అతి సునాయాసం అని విశ్లేషిస్తున్నారు. ఇక పిఠాపురంలో టీడీపీ బలమైన పార్టీ నో డౌట్. ఆ పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది.
పిఠాపురంలో రెండు వందలకు పైగా పోలింగ్ బూతులు ఉన్నాయని ఒక అంచనా. మరి అన్ని బూతులలో జనసేన క్యాడర్ కూర్చోగలదా. ఆ పోల్ మేనేజ్మెంట్ చేయగలదా అంటే దానికి కూడా జవాబు టీడీపీ ఉంది కదా అని వస్తుంది. ఓవరాల్ గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే టీడీపీ గట్టిగా పూనుకోవాల్సి ఉంటుందని. అందుకే పవన్ వెంట వర్మను తిప్పుకుంటున్నారు. పవన్ పిఠాపురం వస్తే ఏమి చేసినా వెంట వర్మ ఉంటున్నారు
పోలింగ్ బూతులలో కూర్చోవడం అంటే ఒక యుద్ధం చేసినట్లే. అనుభవం కూడా ఉండాలి. ప్రత్యర్థి పార్టీలను నిలువరించగలగాలి. అనుకూల ఓట్లు వేయించుకోవాలి. ప్రత్యర్థి పార్టీలని కంట్రోల్ లో ఉంచాలి. ఇవన్నీ ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన వర్మకు బాగా తెలుసు. అందుకే వర్మ మీదనే పూర్తి బాధ్యత పెట్టారు అంటున్నారు.
దాంతో అంతా వర్మమయం అని అంటున్నారు. పవన్ రాకపోయినా నేనే జనంలో ఉండి గెలిపిస్తాను అని వర్మ అంటున్నారు. ఇక్కడే జనసైనికులు అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఒక్క విషయం. రేపటి రోజున పవన్ మంచి మెజారిటీతో గెలుస్తారు. ఆ మీదట కూటమి కూడా గెలిస్తే మంత్రి కూడా అవుతారు. పిఠాపురం తన సొంత నియోజకవర్గంగా ఆయన చేసుకుంటే మాత్రం అపుడే వర్మకు అయినా ఎవరికి అయినా ఇబ్బంది అవుతుంది. ఈ లాజిక్ ని కూడా గమనంలోకి తీసుకుంటూ పిఠాపురం రాజకీయాన్ని చూడాలని అంటున్నారు విశ్లేషకులు.