జగన్ మీద ఓ రేంజిలో రెచ్చిపోయిన పవన్ !
కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ప్రజాగళం ఉమ్మడి సభలో పవన్ చంద్రబాబుతో కలసి పాల్గొన్నారు.
జగన్ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఏపీలో లేకుండా జగన్ ని ఆయన పార్టీని ప్యాక్ చేసి పంపిస్తామని పవన్ కళ్యాణ్ బిగ్ సౌండ్ చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ప్రజాగళం ఉమ్మడి సభలో పవన్ చంద్రబాబుతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ మీద మండిపడ్డారు.
నా సామాజిక వర్గం నేతలతో నన్నే తిట్టిస్తావా జగన్ అంటూ వచ్చేది తమ ప్రభుత్వమే అని జగన్ ని జైలుకు కచ్చితంగా పంపిస్తామని హెచ్చరించారు జగన్ జీవితం జైలుకు బెయిల్ కి మధ్యన ఊగిసలాట ఆడుతోందని ఆయన వెటకరించారు. జగన్ జైలుకే వెళ్తారు ఇది సత్యం అని ఆయన స్పష్టం చేశారు.
జగన్ వల్ల ఏపీ సర్వనశనం అయిందని ఆయన అన్నారు. జగన్ వెంట బీసీలు ఎస్సీ ఎస్టీలు కాపు నేతలు ఉన్నారని వారంతా ఒక్కసారి జగన్ ఏపీకి చేసిన చేటు ఏంటో అర్ధం చేసుకుంటే ఆయన వెంట ఉండరని అన్నారు. జగన్ వైపు ఉంటూ ఏపీకి తీరని ద్రోహం చేస్తున్నారు అని ఆయన వారిని నిందించారు.
తాను ఏపీ కోసం స్వార్ధ రహితమైన రాజకీయం చేస్తున్నానని ఆయన అన్నారు. కానీ తన మంచితనాన్ని అర్ధం చేసుకోకుండా కొంతమంది జనసేన నుంచి వెళ్లిపోయారని వారు వెళ్ళిపోయినా పార్టీకి ఏమీ కాదని ఆయన అన్నారు. జనసేనకు వీర మహిళలు సైనికులు అండగా ఉంటారని అన్నారు.
ఏపీలో ఇసుక దోపిడీ చేస్తోంది వైసీపీ నేతలే అన్నారు. ఈ పార్టీని కొనసాగనిస్తే రాష్ట్రం వెనకబడిపోవడం ఖాయమని అన్నారు. తన సినిమాలను జగన్ అడ్డుకున్నారని కానీ తాను ఎక్కడా తగ్గేది లేదని నాడే చెప్పానని ఆయన అన్నారు. ఇపుడు చెబుతున్నానని కూటమి ప్రభుత్వం రాకుండా ఆపేది ఎవరని ఆయన నిలదీశారు.
తాను జగన్ ని విమర్శించానని ఈసీ నోటీసులు ఇచ్చిందని తాను ఎందుకు అలా చేశాను అన్నది ఈసీకి తొందరలో వివరిస్తాను అని ఆయన అన్నారు. అమలాపురం తన సొంత ఊరు అని పవన్ అన్నారు. ఇక వాలంటీర్లకు కూడా ఆలోచించుకోమని పవన్ కోరడం విశేషం. మీ కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదే లేదని అందువల్ల వారంతా ఆలోచించాలని కోరారు. వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఇస్తామని పదివేల రూపాయల పారితోషికం కూడా తాము ఇస్తామని పవన్ చెప్పారు. ఇదిలా ఉంటే తనను తన సామాజిక వర్గం నేతలతో తిట్టిస్తున్నారు అన్నది పవన్ ముద్రగడను ఉద్దేశించేనా అన్న చర్చ సాగుతోంది. ముద్రగడ దాదాపుగా ప్రతీ రోజూ పవన్ మీద విమర్శలతో దాడి చేస్తున్నారు. దానికి బదులు అన్నట్లుగా పవన్ అమలాపురం సభలో గట్టిగా ఇచ్చారు అని అంటున్నారు.