పవన్ చెప్పిన నాలుగో పెళ్లాం కధ !
ఆ నాలుగవ పెళ్లాం నీవేనా జగన్ అని ఆయన ఫైర్ అయ్యారు. నా గురించి మాట్లాడితే మీ గురించి కూడా చరిత్ర చెబుతాను అని హెచ్చరించారు.
తాడేపల్లిగూడెం సభలో హైలెట్ ఏంటి అంటే పవన్ స్పీచ్. అందులో కొత్తదనం అయితే పెద్దగా లేదు కానీ ఆయన ఆవేశం మాత్రం మరోసారి కనిపించింది. అంతే కాదు తన గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోను అంటూ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు.
జగన్ దృష్టిలో పవన్ ఏంటి అన్నది ఆయనే చెప్పుకున్నారు. పవన్ అంటే ముగ్గురు పెళ్ళాలు రెండు విడాకులు అనుకుంటున్నారా అని మండిపడ్డారు. మాట్లాడితే చాలు నలుగురు పెళ్లాలు అని జగన్ అంటున్నారని నాకు నాలుగవ పెళ్లాం ఎవరు అని ఆయన నిలదీశారు.
ఆ నాలుగవ పెళ్లాం నీవేనా జగన్ అని ఆయన ఫైర్ అయ్యారు. నా గురించి మాట్లాడితే మీ గురించి కూడా చరిత్ర చెబుతాను అని హెచ్చరించారు. టన్నులకు టన్నులే ఉంది సుమా జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో కూడా తనకు తెలుసు అన్నారు.
జగన్ సొంత బాబాయ్ ని మర్డర్ చేశారు అని పవన్ సంచలన కామెంట్స్ చేసారు. అంతకు ముందు ఇదే సభలో మాట్లాడిన చంద్రబాబు అయితే బాబాయ్ ని ఎవరి మర్డర్ చేశారో జగన్ చెప్పు అని డిమాండ్ చేశారు. కానీ పవన్ అయితే జగనే చంపేశారు అని హాట్ కామెంట్స్ చేశారు.
అంతే కాదు తన సొంత చెల్లెలుని గోడకేసి కొట్టారు అని మరో సంచలన ఆరోపణ చేశారు. జగన్ అంటే ఏమో అనుకుంటున్నారు కానీ ఆయన గురించి తనకే ఎక్కువ తెలుసు అన్నారు. అందుకే తాను అన్నీ వదిలి ఆయనతో యుద్ధానికి సిద్ధం అయ్యానని అన్నారు. జగన్ కి ఈసారి ఎన్నికల్లో ఓటమి రుచి చూపిస్తాను అని పవన్ సవాల్ చేశారు.
జగన్ రాష్ట్రాన్ని అయిదుగురు రెడ్లకు అప్పగించి అయిదు కోట్ల మందిని క్షోభ పెడుతూంటే చూస్తూ ఉండలేకే చంద్రబాబుతో జత కట్టాను అని పవన్ తన పొత్తుని సమర్ధించుకున్నారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం బతికి బట్టకడితే కదా రాజకీయలు అందుకే తాను అన్నింటికీ తగ్గి మరీ ప్రజలను గెలిపించాలనే పొత్తులకు రెడీ అయ్యాను అని అన్నారు.
మొత్తానికి చూస్తే జగన్ మీద పవన్ చాలా సంచలన కామెంట్స్ చేశారు. ఆయననే బాబాయ్ హత్య కేసులో ముద్దాయి అన్నట్లుగా ప్రాజెక్ట్ చేశారు. దీని మీద వైసీపీ నుంచి ఏ రకమైన విమర్శలు వస్తాయో చూడాల్సిందే.