పవన్‌కు కాదు.. జనసేనకు ఇది కాల పరీక్ష... !
అవును.. ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే.. పార్టీ కోలుకుంటే.. పార్టీ మిగులుతుంది. నాయకులు మిగులు తారు.
అవును.. ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే.. పార్టీ కోలుకుంటే.. పార్టీ మిగులుతుంది. నాయకులు మిగులు తారు. పవన్ ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడే కావొచ్చు. కానీ, క్షేత్రస్తాయిలో ఆయన నిలబడడం ఇప్పట్లో సాధ్యం కాదు. సినిమా రంగాన్ని వదిలేయడం ఆయన వల్ల కూడా కాదు. అలా అయితే..ఆయన ఆర్థికంగా నడవనూ లేరు.పార్టీని కూడా నడిపించలేరు. సో.. పార్టీ అవసరం ఆయనకు సెకండరీనే. పార్టీ ఉన్నది ఆయన వల్ల.. ఆయనైతే.. జనసేన వల్ల లేరు కదా! ఇదీ.. లాజిక్. కాబట్టి పార్టీ కావాలి.
పార్టీ తరఫున పోటీ చేయాలి..అ నే నాయకులకు పవన్ పరోక్షంగా ఇచ్చిన సందేశం ఇదే. తాజాగా టీడీపీ నుంచి కేవలం 24 సీట్లు మాత్రమే జనసేన తీసుకుంది. దీనిపై సొంత నేతల నుంచి విమర్శలు వస్తున్నా యి. పార్టీ కీలక నేతలు కూడా పెదవి విరుస్తున్నారు. అయితే.. దీనికి సమాధానం పవన్ చెప్పకనే చెప్పా రు. గత ఎన్నికల్లో కనీసం మనం 10 చోట్ల అయినా. గెలిచి ఉంటే ఇప్పుడు మాకు ఇన్ని సీట్లు కావాలి.. అని డిమాండ్ చేసేవాడిని. కానీ, మనకు ఆ పరిస్థితి లేదు. అన్నారు.
అంటే.. పార్టీ కనుక క్షేత్రస్థాయిలో నాయకులను గెలిపించుకుని ఉంటే.. వేరేగా ఉండేదని పవన్ చెప్పేశా రు. దీనికి ముందుండి నడిపించాల్సింది.. ఈ లక్ష్యాన్ని చేరాల్సింది.. అక్షరాలా.. నాయకులు, కార్యకర్తలే. కేవలం పవన్ ఉంటేనే పార్టీ జెండా కడతాం.. పవన్ వస్తేనే ప్రజల్లోకి వెళ్తాం.. అనే ధోరణి కారణంగానే ఇప్పటి వరకు పార్టీ బలోపేతం కాకుండా పోయింది. అందుకే.. నాయకులు గత ఎన్నికల్లో 148 చోట్ల పోటీ చేసిన పరాజయం పాలయ్యారు.
ఇక, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో అయినా.. 24కు కనీసం 20 చోట్ల విజయం దక్కించుకునే దిశగా నాయకులు, కార్యకర్తలు అడుగులు వేస్తే.. తద్వారా పార్టీ పుంజుకుంటుంది. దీంతో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం వీరికే లభిస్తుంది. పార్టీ బలోపేతం అయితే.. పవన్ ఒక్కరే అన్ని చోట్ల నుంచి పోటీ చేయరు కదా! సో.. ఇప్పుడు జనసైనికుల ముందున్న లక్ష్యం.. ఎక్కువ స్థానాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడం.. పార్టీ పవన్‌కు కాదు.. మనకు అవసరం అన్న విధానాన్ని అనుసరించడం. పవన్‌కు పార్టీలేకోపోయినా.. ఆయన సినిమాల్లోరాణిస్తారు. కానీ, రాజకీయాలను నమ్ముకున్నవారు.. జనసేనను బలోపేతం చేసుకుంటే సొంత వేదిక అంటూ.. ఏర్పడుతుంది.