'నా భార్యను తిట్టారు'.. పవన్ ఎమోషనల్ కామెంట్స్..!
అవును... నేటి సాయంత్రంతో ఎలక్షన్ ప్రచారం ముగియనుంది. దీంతో... ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సందడి చివరి దశకు చేరుకుంది. నేటి సాయంత్రంతో మైకులు మూగపోబోతున్నాయి.. ప్రచార రథాలు ఎక్కడివక్కడ నిలిచిపోబోతున్నాయి. ఇక ఆదివారం మౌనవ్రంతం అనంతరం సోమవారం ఉదయాన్నే పోలింగ్ మొదలవ్వబోతోంది. ఇక ఈ ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్ గా నిలిచిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటనేది తెలిసిన సంగతే! ఈ సమయంలొ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు!
అవును... నేటి సాయంత్రంతో ఎలక్షన్ ప్రచారం ముగియనుంది. దీంతో... ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన పవన్... గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాలలోనూ ఓడిపోయారు.
దీంతో... ఈసారి బీజేపీ, టీడీపీలతో కూటమిగా ఏర్పడి పిఠాపురాన్ని ఎంచుకుని అక్కడ నుంచి బరిలో నిల్చున్నారు. దీనితో ఈసారి పవన్ కల్యాణ్ విజయం ఖాయమని జనసైనికులు భావిస్తుండగా.. ఈసారి కూడా పవన్ కు షాకివ్వాలని వైసీపీ ఫిక్సయ్యిందని తెలుస్తుంది! ఈ నేపథ్యంలో... పవన్ ను ఎలాగైనా గెలిపించుకోవాలని పలువురు సినీ జనాలు పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు.
ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ ను ఎమ్మెల్యేగా గెలిపించమని పిఠాపురం ఓటర్లను విజ్ఞప్తి చేశారు! ఈ క్రమంలో తాజాగా తన సొంతవారిని, ఇంట్లో వాళ్లను రాజకీయాల్లోకి లాగి ఇబ్బంది పెడుతున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా తన భార్యతో జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు.
ఇందులో భాగంగా.. నా భార్యని తిట్టారు.. ఆమె విదేశీయురాలు.. ఆమెకి ఇక్కడి రాజకీయాలు తెలియవు.. ఎందుకు తిడుతున్నారు అని నన్ను అడిగింది.. భారతదేశంలో రాజకీయాలు అర్ధం కావు.. నన్ను క్షమించు అని తన భార్యను కోరినట్లు పవన్ తెలిపాడు. ఇదే సమయంలో నీకు ఎందుకు ఇంత పిచ్చి అని ఆమె అడిగితే.. ప్రజల కోసం నిలబడటానికి నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.