పవన్ మౌనం వెనక !?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు అంటే ఎవరికీ తెలియదు అంటున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు అంటే ఎవరికీ తెలియదు అంటున్నారు. అది మీడియాలో హడావుడి చేయాల్సిన విషయం కాదు కానీ అలా ఎక్కడ ఆయన అని విమర్శలు కామెంట్లూ అయితే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మే 13న పోలింగ్ రోజున మంగళగిరిలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆ తరువత ఆయన మరుసటి రోజు వారణాసిలో మోడీ నామినేషన్ సందర్భంగా కనిపించారు. అక్కడ నుంచి ఆయన కాశీ విశ్వేశ్వరుణ్ణి సతీసమేతంగా దర్శించుకుని హైదారబాద్ చేరుకున్నారు అని వార్తలు వచ్చాయి.
అక్కడ నుంచే ఆయన నుంచి అప్డేట్స్ లేవు అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వారణాసి ఎయిర్ పోర్టులో నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. అదే ఆయన ఏపీ పోలింగ్ తీరు మీద చేసిన ఒక విశ్లేషణ. ఆ తరువాత ఆయన మౌనాన్ని ఆశ్రయించారు. ఈ మధ్యలో విడుదల చేసిన ఒక ప్రకటనలో కూడా పోలింగ్ కి పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చినందుకు ఓటు హక్కు వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు.
ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో టీడీపీ వైసీపీ దూకుడు చేస్తున్నాయి. మేమే గెలుస్తున్నామని చెబుతున్నాయి. కానీ పవన్ నుంచి మాత్రం ఆ తరహా అతి ప్రకటనలు రావడం లేదు అని అంటున్నారు. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే అని అంటున్నారు. మాటలు కాదు ముఖ్యం చేతలు అన్నదే పవన్ స్ట్రాటజీ అని అంటున్నారు.
రిజల్ట్ మాట్లాడుతుంది తప్ప మనం ఎందుకు అన్న ఆయన ఆలోచనల వల్లనే జనసేన నేతలు కూడా వ్యూహాత్మకమైన మౌనాన్ని పాటిస్తున్నారు అని అంటున్నారు. ఈవీఎంలలో ఓటు చేరింది. ఎవరు విజేత అన్నది పక్కాగా అది తేలుస్తుంది. ఈ మధ్యలో ఆర్భాటంగా ప్రకటనలు చేసుకుంటూ అతి చేసినా హడావుడి చేసినా ఉపయోగం ఏమిటి అన్నది జనసేన ఫిలాసఫీగా ఉంది అని అంటున్నారు.
ఆ విధంగా తాము అనుకున్న టార్గెట్ కి రీచ్ కావడం కోసమే పనిచేశామని వారు అంటున్నారు. రెండు ఎంపీ సీట్లూ 21 ఎమ్మెల్యే సీట్లలో పూర్తిగా విజయావకాశాలు ఉంటాయని వారు భావిస్తున్నారు. ఆ టార్గెట్ రీచ్ అయిన తరువాతనే తాము రాజకీయంగా బలపడగలమని రానున్న కొత్త ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించగలమని భావిస్తున్నారు
ఇదిలా ఉంటే కౌంటింగ్ కి ముందు ప్రకటనలు చేసి ఆ తరువాత ఇబ్బందులు పడడం కంటే మంచి రిజల్ట్స్ ని చూపించి ఆ మీదట జనంలోకి వెళ్తే ఆ కిక్కే వేరబ్బా అన్నదే జనసేన విధానం అనీ అంటున్నారు. అందుకే వైసీపీ టీడీపీ ఎంతగా రచ్చ చేసినా జనసేన మాత్రం సైలెంట్ గానే ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ విదేశాలకు వెళ్లారని అంటున్నారు.
రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన ఈ నెల 31న ఇండియాకు వస్తారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఏపీలో జనసేన వ్యూహమే కరెక్ట్ గా ఉంది అని అంటున్నారు. మౌనంగానే ఉండడం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనుకోవడమే బెటర్ అని అంటున్నారు. ఫలితాలు వచ్చిన తరువాతనే జనసేన మాట్లాడుతుంది అని అంటున్నారు.