షర్మిల మాకు శత్రువే....వైసీపీ పక్కా క్లారిటీ...!

వైఎస్ షర్మిల మాకు రాజకీయ శత్రువే అని వైసీపీ కీలక నేత, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. షర్మిల అటు వైపు ఉంది కాబట్టి మాకు శత్రువు అని ఆయన అంటున్నారు.

Update: 2024-02-04 01:18 GMT
షర్మిల మాకు శత్రువే....వైసీపీ పక్కా క్లారిటీ...!
  • whatsapp icon

వైఎస్ షర్మిల మాకు రాజకీయ శత్రువే అని వైసీపీ కీలక నేత, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. షర్మిల అటు వైపు ఉంది కాబట్టి మాకు శత్రువు అని ఆయన అంటున్నారు. ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు ఉచ్చులో చిక్కుకుందని పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు

ముమ్మాటికీ వైఎస్సార్ కుటుంబంలో చీలికలకు ప్రధాన కారకుడు చంద్రబాబే అని పెద్దిరెడ్డి మండిపడ్డారు. కుటుంబాలని విడదీయడంలో చంద్రబాబు దిట్ట అని ఆయన అన్నారు షర్మిల సైతం బాబు ఉచ్చులో పడిందని ఆయన అంటున్నారు. షర్మిలను కాంగ్రెస్ లో చేర్చడం ఏపీకి రప్పించడం వెనక చంద్రబాబు స్కెచ్ ఉందని పెద్దిరెడ్డి ఆరోపించారు.

చచ్చిన కాంగ్రెస్ ని లేపడానికి ఎవరు వచ్చినా ఏమీ చేయలేరని అన్నారు. ఏపీ వరకూ చూస్తే కాంగ్రెస్ చచ్చిపోయి చాలా కాలం అయింది అని పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కి నామ రూపాలు లేవని అన్నారు. అందులో ఉన్న కీలక నేతలతో పాటు పార్టీ మొత్తం వైసీపీలోకి వచ్చేసి కూడా ఎంతో కాలం అయింది అని ఆయన అన్నారు.

ఏపీ కాంగ్రెస్ లో ఎవరైనా మిగిలి ఉన్నారు అంటే రఘువీరారెడ్డి, గుడుగు రుద్రరాజు, షర్మిల కేవీపీ రామచంద్రరావు మాత్రమే అన్నారు. ఈ నలుగురూ తప్ప కొత్తగా ఎవరైనా వచ్చారా అని ఆయన నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే షర్మిల మీద పెద్దిరెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. షర్మిల మాకు శత్రువు అని జగన్ కి అత్యంత సన్నిహిత మంత్రి ప్రకటించడమే ఇపుడు ఆ చర్చకు కారణం. అంటే వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ ఈ విధంగా సంకేతాలు ఇచ్చింది అనుకోవాలి.

ఇప్పటికే ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు షర్మిల మీద విరుచుకుపడుతున్నాయి. మరో వైపు చూస్తే ఆమె మీద సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ నడుస్తోంది. ఇపుడు వైసీపీ కీలక నేతగా పెద్దిరెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో షర్మిల మీద రానున్న కాలంలో వైసీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది అని అంటున్నారు.

ఏది ఏమైనా షర్మిల కూడా ఎక్కడా తగ్గడంలేదు. ఆమె కడప సభలో అయితే ఏమి చేసుకుంటారో చేసుకోండి నేను ఏపీలో ఉంటా మీకు ఎదురు నిలబడి రాజకీయాలు చేస్తాను అని సవాల్ చేశారు. దాంతో పాటు ఆమె ఈ నెల 5 నుంచి మరో విడత జిల్లా టూర్లు పెట్టుకున్నారు. అవి పది రోజుల పాటు సాగనున్నారు.

తొలి పది రోజులు ఆమె ప్రసంగాలు ఏపీలో హీట్ పుట్టించాయి. ఈసారి మరింత డోస్ పెంచి మరీ షర్మిల స్పీచ్ ఇచ్చే చాన్స్ ఉంది. దాంతో వైసీపీ కూడా ముందే ప్రిపేర్ అయి ఆమె రాజకీయ శత్రువే అని చెప్పేసింది. సో ఇక మీదట షర్మిల కామెంట్స్ కి వైసీపీ ధీటైన సమాధానం క్యాడర్ లెవెల్ నుంచి కూడా రావచ్చు అన్న మాట.


Tags:    

Similar News