దేశాధ్యక్షురాలి ఇంట్లో సోదాలు.. రోలెక్స్ వాచీ ఎంత పని చేసింది?
పెరూ దేశ అధ్యక్షురాలిగా డైనాబులురెటే అనే మహిళ పగ్గాలు చేపట్టారు. ఆ దేశంలో ఎన్నికల ప్రక్రియ షురూ అయిన తర్వాత దేశానికి అధ్యక్షురాలిగా ఎంపికైన తొలి మహిళ ఆమే కావటం గమనార్హం.
మీరు చదివింది కరెక్టే. ఆ దేశ దేశాధ్యక్షురాలి ఇంట్లో సోదాలు జరిగాయి. అది కూడా ఆమె చేతికి పెట్టుకున్న ఖరీదైన రెలెక్స్ వాచీ పుణ్యమా అని. ఒక దేశాధ్యక్షురాలి ఇంట్లో అధికారుల సోదాలకు రోలెక్స్ వాచీ కారణమైందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. విన్నంతనే విచిత్రంగా అనిపించటంతో పాటు.. ఇలాంటి చర్యలు చేపట్టే దేశాలు కూడా ఉన్నాయా? అన్న భావన కలుగొచ్చు. ఇంతకూ ఈ విచిత్ర ఉదంతం ఏ దేశంలో చోటు చేసుకుందంటే..
పెరూ దేశ అధ్యక్షురాలిగా డైనాబులురెటే అనే మహిళ పగ్గాలు చేపట్టారు. ఆ దేశంలో ఎన్నికల ప్రక్రియ షురూ అయిన తర్వాత దేశానికి అధ్యక్షురాలిగా ఎంపికైన తొలి మహిళ ఆమే కావటం గమనార్హం. 2022లో ఆమె అధికారాన్ని చేపట్టారు. దేశ అధ్యక్షరాలి హోదాలో ఎన్నికైన వేళ.. ఆమె ధరించిన రోలెక్స్ వాచీ పెను వివాదానికి కారణమైంది. ఎన్నికల వేళలో ఆమె దాఖలు చేసిన అఫిడవిట్ లో తనకున్న రోలెక్స్ వాచీ వివరాల్ని అందులోపేర్కొనలేదంటూ ఒక మీడియా సంస్థలో ఒక వార్త పబ్లిష్ అయ్యింది.
ఇది కాస్తా సంచలనంగా మారటంతో పాటు.. ఆమె మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇంట్లో అవినీతి నిరోధక శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. కాకుంటే.. సోదాలు నిర్వహించే వేళలో అధ్యక్షురాలు ఇంట్లో లేరని చెబుతున్నారు. అక్కడి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ చర్యను చేపట్టారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని మాజీ దేశాధ్యక్షులు పెడ్రో కాస్టిల్లో ప్రయత్నించారు.
ఇదిలా ఉంటే.. ఇక్కడో ట్విస్టు చెప్పాలి. పెరూ దేశంలో దేశాధ్యక్షుడు లేదంటే దేశాధ్యక్షురాలు ఎవరైనా సరే.. అవినీతి ఆరోపణలు రుజువైనా.. పదవీ కాలం పూర్తి అయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. అక్కడి నిబంధనల ప్రకారం ఆమె 2026 జులై వరకు దేశాధ్యక్ష పదవిలోనే కంటిన్యూ కావొచ్చు. ఆమె ధరించిన రోలెక్స్ వాచీ కారణంగా ఆమెపై వెల్లువెత్తిన ఆరోపణలతో.. ఆమె అధికారాన్ని అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారా? అన్న కోణంలో విచారిస్తారు.
తాజా విమర్శలు.. ఆరరోపణల వేళ.. దేశాధ్యక్షురాలిని అక్కడి మీడియా సంస్థ ప్రశ్నలు వేసింది. ప్రభుత్వ డబ్బుతో అంత ఖరీదైన వస్తువుల్ని ఎలా కొన్నారంటూ ప్రశ్నించగా.. తాను పద్దెనిమిదేళ్ల వయసు నుంచి కష్టపడుతున్నానని.. సొంతంగానే ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు. స్వచ్ఛంగా అధ్యక్ష భవనంలోకి అడుగు పెట్టానని.. ఎలాంటి మరక లేకుండానే తాను పదవి నుంచి వైదొలుగుతానన్న ధీమాను వ్యక్తం చేయటం ఆసక్తికరంగా మారింది.