ఫోన్‌ కవర్‌ లో డబ్బులు పెడుతున్నారా... ఇదొకసారి చదవండి!

అవును... స్మార్ట్‌ ఫోన్ కవర్ లోపలివైపు కరెన్సీ నోట్లు దాయడం వల్ల ఆ ఫోను కలిగినవారి ప్రాణాలు గాలిలో కలసిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది

Update: 2023-08-20 00:30 GMT

మన దేశంలో చాలామంది తమ స్మార్ట్‌ ఫోన్ కవర్ లోపలివైపు కరెన్సీ నోట్లు పెడుతుంటారు. ముఖ్యంగా మహిళలు అయితే పోకెట్స్ లేకో.. లేక, అత్యవసర నిధిలో భాగంగానో అక్కడ దాస్తుంటారు! అయితే ఇలా చేయడం ఎంతవరకూ ప్రమాదకరంగా పరిణమిస్తుందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ప్రాణాలకే ప్రమాదం!

అవును... స్మార్ట్‌ ఫోన్ కవర్ లోపలివైపు కరెన్సీ నోట్లు దాయడం వల్ల ఆ ఫోను కలిగినవారి ప్రాణాలు గాలిలో కలసిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. అదెలాంటే... ఫోన్‌ ను నిరంతరం ఉపయోగిస్తున్నప్పుడు అది వేడిగా మారడం తెలిసిందే. అలా ఫోన్ వేడెక్కిన వెంటనే దాని వెనుక భాగంలో ప్రభావం కనిపిస్తుంది.

అటువంటి పరిస్థితిలో ఫోన్ కవర్‌ లో కరెన్సీ నోటు ఉన్నట్లయితే.. అప్పుడు ఫోన్ నుంచి వేడి బయటకు విడుదల కాదు. దీంతో ఫోన్ మరింత వేడెక్కే ప్రమాదం ఉంది. ఫలితంగా ఆ ఫోను పేలిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది! అందుకే ఫోన్‌ కు బిగుతుగా ఉండే కవర్‌ ను ఉపయోగించకూడదని.. దాని వెనుక మరింత బిగుతుగా మారేలా కరెన్సీ నోట్లు వంటివి పెట్టకూడదని నిపుణులు చెబుతుంటారు.

ముఖ్యంగా కరెన్సీ నోట్లు మాత్రం అస్సలు పెట్టకూడదని చెబుతున్నారు నిపుణులు. కారణం... కరెన్సీ నోట్లను కాగితంతో తయారు చేయడమే మాత్రమే కాదు... దానికి అనేక రకాల రసాయనాలను కూడా ఉపయోగిస్తారు. ఈ సమయంలో ఫోన్ వేడెక్కిన సందర్భంలో ఆ వేడి బయటకు పోకుడా రసాయినాలతో కూడిన కరెన్సీ నోటు అడ్డు పడుతుంది. ఫలితంగా ఫోన్ పేలిపోతుంది!

అందుకే... ఫోన్ కవర్‌ లోపల కరెన్సీ నోట్లు ఉంచే అలవాటును మానుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇదే సమయంలో ఏటీఎం కార్డులు వంటివి కూడా ఉంచొద్దని చెబుతున్నారు. ఇదే సమయంలో ఫోన్ కవర్‌ మరీ బిగుతుగా ఉండకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. సో... బీ కేర్ ఫుల్!

Tags:    

Similar News