మహిళా భద్రతే లక్ష్యంగా మెట్రోలో పింక్‌ స్క్వాడ్‌... డిటైల్స్ ఇవే!

ఇందులో భాగంగా ముందుగా చెన్నై మెట్రోలో దీన్ని పైలట్ ప్రాజెట్ గా చెపట్టబోతున్నారు.

Update: 2024-02-16 23:30 GMT

ప్రస్తుతం సమాజమంలో మహిళల భద్రతకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్చలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే "షీ టీం", "మహిళా పోలీస్", "దిశ" పోలీస్ స్టేషన్ వంటి అంశాలు పురుడుపోసుకున్నాయి. ఈ సమయంలో మెట్రో రైల్వే స్టేషన్ లలో మహిళల భద్రతకు సరికొత్త టీం రంగంలోకి దిగబోతుంది. ఇందులో భాగంగా ముందుగా చెన్నై మెట్రోలో దీన్ని పైలట్ ప్రాజెట్ గా చెపట్టబోతున్నారు.

అవును... చైన్నె మెట్రో రైల్వే స్టేషన్లలో మహిళల భద్రతకు "పింక్‌ స్క్వాడ్‌" రంగంలోకి దిగింది. మార్షల్‌ ఆర్ట్స్‌ లో ఆరితేరిన సుమారు 25 మంది యువతులను తొలి విడతగా ఈ స్క్వాడ్ లో భాగంగా రంగంలోకి దించారు. ఈ టీం ని మెట్రో ఎండీ సిద్ధిఖి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఈ టీం ఎప్పుడెప్పుడు, ఏ విధంగా, ఎక్కడెక్కడ పనిచేస్తుంది.. ఈ టీం సభ్యులకున్న స్పెషల్ క్వాలిటీస్ ఏమిటి.. ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది అనే విషయాలను వెళ్లడించారు.

ప్రస్తుతం చెన్నైలో రెండు రెండు మార్గాలలో మెట్రో పరుగులు పెడుతుంది. ఈ రెండు మార్గాలలోనూ కలిపి సుమారు 38 రైల్వే స్టేషన్లను ఉన్నాయి. ఈ స్టేషన్ లలో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని రకాల హంగులలో ఏర్పాట్లు ఉంటాయి. ఇదే సమయంలో మెట్రో రైల్వే యంత్రాంగం నేతృత్వంలో ప్రత్యేక సెక్యూరిటీ వింగ్‌ భద్రతా విధుల్లో ఉంటుంది.

ఈ క్రమంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో ట్రైన్స్ నడుపుతున్నారు. ఇందులో భాగంగా తొలి విడతగా 25 మంది యువతులను ఈ స్క్వాడ్ కోసం ఎంపిక చేశారు. వీరంతా మార్షల్‌ ఆర్ట్స్‌ తదితర యుద్ధ కళలలో ఆరి తేరిన వారు కాగా... మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళలకు చిన్న సమస్య అని చెప్పినా వీరంతా వారి ముందు చటుక్కున వాలిపోతారు.

ఇదే సమయంలో... మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక బోగీలతోపాటు కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలోనూ ఈ స్క్వాడ్‌ విధుల్లో ఉంటుంది. ఎక్కడ ఉన్నప్పటికీ మహిళల భద్రతే వీరి లక్ష్యం. ఈ సందర్భంగా స్పందించిన మెట్రో ఎండీ సిద్ధిఖీ... పింక్‌ స్క్వాడ్‌ పేరిట ఉమెన్‌ సెక్యూరిటీ ఫోర్స్ గా ఈ బృందం పనిచేస్తుందని తెలిపారు.

కాగా... చైన్నె నగరంలో ఎయిర్ పోర్ట్ నుంచి ఆలందూరు – కోయంబేడు మీదుగా సెంట్రల్‌ వరకు.. సెయింట్‌ థామస్‌ మౌంట్‌ నుంచి ఆలందూరు – అన్నా సాలై – సెంట్రల్‌ మీదుగా విమ్కో నగర్‌ వరకు మెట్రో రైలు సేవలు అందుతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News