బర్త్ డే ఎఫెక్ట్ : బదిలీ వేటు
పార్టీలకు అతీతంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు దానికి అతీతంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తుంది.
పార్టీలకు అతీతంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు దానికి అతీతంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తుంది. తాజాగా సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి పోలీస్ స్టేషన్ లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ జోషి బర్త్ డే వేడుకలు నిర్వహించడం విమర్శలకు దారితీసింది.
స్వయంగా ఎస్ఐ లక్ష్మణ్, సిబ్బంది పాల్గొని కేక్ కట్ చేయించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ మేరకు హైదారాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ ఎస్‌ఐని వీఆర్‌కు పంపారు. మిగతా సిబ్బంది పాత్ర పై విచారణకు ఆదేశించారు.
ఇటీవల వరంగల్ పట్టణంలో మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలకు హాజరైన వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, ఇంతెజార్‌గంజ్ సీఐ మచ్చ శివకుమార్, మిల్స్‌కాలనీ సీఐ మల్లయ్య, పోలీసు సిబ్బంది హాజరై కేక్‌కట్ చేసి చీరెలు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది.