ఆ 'ఫైర్' ఏమైంది... వైసీపీ ఫైర్‌బ్రాండ్ లీడర్ ఎక్కడ...!
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఫైర్‌బ్రాండ్ నాయకుడిగా పేరున్న మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఫూర్తిగా సైలెంట్ అయిపోయారు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఫైర్‌బ్రాండ్ నాయకుడిగా పేరున్న మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఫూర్తిగా సైలెంట్ అయిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడు.. తర్వాత కూడా..ఆయన ఫైర్ కామెంట్లు చేస్తూ.. మీడియాలో సెంటర్ పాయింట్‌లో ఉండేవారు. అయితే.. గత కొంతకాలంగా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. మీడియాకు సైతం అందుబాటులో లేకుండా పోయారు.
దీంతో ఆ ఫైర్ ఏమైంది? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. నిజానికి 2019 ముందు వరకు అం దరినీ కలుపుకొనిపోయిన అనిల్‌కుమార్ మంత్రి అయిన తర్వాత మాత్రం.. అనూహ్యంగా కొందరినే అ క్కున చేర్చుకున్నారు. దీంతో సొంత ఇంట్లోనే కుంపట్లు రాజుకున్నాయి. ఇక, గతంలో ఉన్న విరోధాన్ని మంత్రిగా పక్కన పెట్టిన తర్వాత.. కాకాని గోవర్ధన్‌రెడ్డితో కొనసాగించడం మరింతగా వివాదంలోకి నెట్టింది.
మంత్రిగా కాకాని ప్రమాణం చేశాక.. నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్తే.. దానికి ప్రతిగా అనిల్ కుమార్ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం అప్పట్లో వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో రెండు సార్లు అధిష్టానం నుంచి వార్నింగులు కూడా వెళ్లాయని ఆయన అనుచరులే వ్యాఖ్యానించారు. ఇక, తన సన్నిహితుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీ మారినప్పుడు కూడా అనిల్ మౌనంగా ఉన్నారు.
ప్రస్తుతం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు.. మరోవైపు.. కొందరికి ఉద్వాసన పలుకుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు.. హడావుడి చేస్తున్నారు. ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. కార్యక్రమాలు నిర్వ హిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. నెల్లూరు సిటీలో మాత్రం అనిల్ జాడ ఎక్కడా కనిపించడం లేదు. మరి ఆయన అలిగారా? లేక.. ఉద్దేశ పూర్వకంగానే దూరంగా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది.