పెళ్లైన 6 రోజులకే తల్లైంది.. కట్ చేస్తే ట్విస్టులే ట్విస్టులు

ఈ ఉదంతంలోకి వెళితే.. యూపీలోని మొరాదాబాద్ కు చెందిన ఒక అమ్మాయి.. పెళ్లైన ఆరు రోజులకే తల్లైంది. దీంతో.. ఈ వ్యవహారం పెద్ద రచ్చగా మారింది.

Update: 2023-10-19 04:27 GMT

వినేందుకే విచిత్రంగా అనిపించే ఉదంతాలు కొన్ని చోటు చేసుకుంటాయి అప్పుడప్పుడు. అలాంటి ఉదంతమే ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. రీల్ కు మించిన ట్విస్టులు ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. యూపీలోని మొరాదాబాద్ కు చెందిన ఒక అమ్మాయి.. పెళ్లైన ఆరు రోజులకే తల్లైంది. దీంతో.. ఈ వ్యవహారం పెద్ద రచ్చగా మారింది. సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అమ్మాయికి పెళ్లైంది. సరిగ్గా.. ఆరు రోజులకు డెలివరీ కావటం.. ఆడపిల్లకు జన్మనివ్వటం షాకింగ్ గా మారింది.

భర్త కుటుంబీకుల అభ్యంతరం నేపథ్యంలో.. ఆమెకు ట్రిపుల్ తలాక్ ఇచ్చేసి.. ఇంట్లో నుంచి బయటకు పంపారు. రోజుల పాపను తీసుకొన్న ఆ అమ్మాయి.. ప్రియుడి ఇంటికి వెళ్లింది. ఈ వ్యవహారం చుట్టుపక్కల షాకింగ్ గా మారి.. హాట్ టాపిక్ అయ్యింది. తన ఇంటికి వచ్చిన ఆ అమ్మాయిని ప్రియుడు నో అనటంతో విషయం పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. పిల్ల తల్లి తన కుమార్తెకు న్యాయం చేయాలని పోలీసుల్ని కోరారు.

ఇదే సమయంలో ఇరు వర్గాల మధ్య పంచాయతీ జరటం.. ఇరు వర్గాలకు చెందిన పెద్దలు కూర్చొని ఈ మొత్తం వ్యవహారాన్ని చర్చించారు. చివరకు.. ప్రేమించిన యువకుడ్ని.. సదరు యువతిని పెళ్లి చేసుకోవాల్సిందేనని తేల్చేశారు. దీంతో.. ఆ యువకుడు పెద్దల నిర్ణయాన్ని సరే అన్నట్లుగా చెబుతున్నారు.

ఈ మొత్తం ఉదంతంలో.. పెళ్లి నాటికి డెలివరీకి దగ్గరగా ఉన్న అమ్మాయి తీరు తేడాగా అనిపించలేదా? ఆ విషయాన్ని పెళ్లి కొడుకు తరఫు వారు ఎలా మిస్ అయ్యారన్నది ఒకటైతే.. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎలా గమనించలేదు? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా ఈ ఉదంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News