30 ఇయర్స్ పృథ్వీ ఇక ఫుల్ టైమ్ పాలిటిక్స్?
సినీ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇటీవల అటు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఫుల్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
సినీ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇటీవల అటు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఫుల్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా "లైలా" సినిమాకు సంబంధించిన ఫంక్షన్ లో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం రేపాయి! అవి తమ పార్టీని ఉద్దేశించి చేసినవేనని వైసీపీ శ్రేణులు పృథ్వీతో పాటు లైలా సినిమాను టార్గెట్ చేశారు.
ఆ సమయంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా స్పందించిన పృథ్వీ... తన వల్ల సినిమా ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే సారీ చెబుతున్నానని.. ఇంతటితో దీనికి ముగింపు పలకండి అని.. బాయ్ కాట్ లైలా వద్దు, వెల్కమ్ లైలా అనండని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు.
సరే ఇక్కడితో ఈ విషయం ముగిసింది అని చాలామంది భావించారని అంటారు. ఈ సమయంలో ఇటీవల ఎక్స్ వేదికగా స్పందించిన పృథ్వీ... తన భావలను తాను స్టేజ్ పైన ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారని.. అందువల్ల ఈ రోజు నుంచి ఎక్స్ వేదిక ఉపయోగించుకుని తన భావ ప్రకటన స్వేచ్ఛను తెలియపరుస్తానని ప్రకటించారు.
నాటి నుంచి పృథ్వీ సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వానికి, ప్రత్యేకంగా జనసేనకు మద్దతు ప్రకటిస్తూ.. వైసీపీని పరోక్షంగా ఎద్దేవా చేస్తూ బిజీగా గడుపుతున్నట్లున్నారనే చర్చ నెట్టింట మొదలైందని అంటున్నారు. ఈ సందర్భంగా తన సినిమా కెరీర్ ను పూర్తిగా పక్కనపెట్టి మరీ ఫుల్ టైమ్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని ప్రచారం మొదలైందని చెబుతున్నారు.
ఇదే సమయంలో.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నాల స్థానంలో ఆయన దూకుడుగా రాజకీయ వ్యాఖ్యతగా మారారని.. తరచూ ఎక్స్ వేదికగా వైసీపీని లక్ష్యంగా చేసుకుని దూకుడు ప్రదర్శిస్తున్నరనే చర్చ అటు సినిమా సర్కిల్స్ లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ నడుస్తోందని చెబుతున్నారు.
ఈ సమయంలో కూటమి ప్రభుత్వంలో ఆయన రాజకీయ పదవిని చేపట్టాలనే ఆసక్తితో ఉన్నారనే ప్రచారమూ జరుగుతుందని అంటున్నారు. మరి అటు సినిమాలు, ఇటు రాజకీయాల మధ్య పృథ్వీ కెరీర్ ఎటువైపు పీక్స్ కి చేరుతుందనేది వేచి చూడాలి!