పవన్ కార్టూన్లపై "పంచ్"లు... వీడియో వైరల్!
ఇందులో భాగంగా తాజాగా భీమిలిలో జరిగిన "సిద్ధం" మీటింగ్ కి నేల ఈనిందా అన్నట్లుగా జనం హాజరైన సంగతి తెలిసిందే.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ అన్ని రకాలుగానూ "సిద్ధం" అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒకపక్క ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు చేపడుతూ.. మరోపక్క ప్రభుత్వ కార్యక్రమాలను చక్కబెడుతున్న జగన్.. మరోపక్క "సిద్ధం" అంటూ కేడర్ తో రీజియన్స్ వారీగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా భీమిలిలో జరిగిన "సిద్ధం" మీటింగ్ కి నేల ఈనిందా అన్నట్లుగా జనం హాజరైన సంగతి తెలిసిందే.
ఈ సభకు హాజరైన జనాలను చూసి ప్రత్యర్థులు వణికిపోతున్నారంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. సుమారు 14 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ సభకు వచ్చిన జనాలతో ఆ స్థలం మొతతం నిండిపోవడమే కాకుండా... రోడ్ల వెంట సైతం ఇంకా జనం ఉన్న పరిస్థితి. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా సభాస్థలిలో ఏర్పాటు చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, మొదలైన కార్టూన్లు సైతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
అవును... "సిద్ధం" సభా ప్రాంగణంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల కార్టూలను ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. ఇందులో ప్రధానంగా వాటి ముందు బాక్సింగ్ బ్యాగ్ లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కార్టూన్ కటౌట్ ముందు ఒక బాక్సింగ్ బ్యాగ్ ను ఉంచారు. దీంతో కొంతమంది వైసీపీ కార్యకర్తలు అక్కడ "పంచ్" లు ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే... వారు ఆ బ్యాగ్ ని కొట్టే ఒక్కో పంచ్... పవన్ ని కొడుతున్నట్లు అన్నమాట అనే కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి!
ఈ క్రమంలో ఈ కార్టూన్ల ముందు ఉంచిన బాక్సింగ్ బ్యాగ్ లపై పంచ్ ల వర్షం కురిపిస్తూ వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటుంటే... టీడీపీ - జనసేన మీటింగ్ లలో ఇకపై జగన్ కార్టూన్ లను కూడా ఉంచాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు తమ్ముళ్లు, జనసైనికులు! దీంతో... ఇందులో కూడా కాపీనా అంటూ ఫ్యాన్ కేడర్ కౌంటర్లు వేస్తున్నారు!! ఏది ఏమైనా... ఇది మంచి సంప్రదాయం కాదనే కామెంట్లు పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లో విమర్శలు ఉండటం సహజం.. అవి కూడా సహేతుకంగా, వీలైనంత సవ్యమైన బాషలో ఉండాలని చెబుతున్నారు. అలా కాకుండా... వ్యక్తిగత దూష్ణలకు తెరతీయడం ఎప్పుడైతే మొదలుపెట్టారో... ఇలాంటి పరిస్థితులు కల్పించబడటం సహజం అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా... ఇలాంటి విషయాల్లో సంయమనం, పునరాలోచనా అత్యంత ప్రాధాన్యమైనవనేది పాయింట్!