లోకేష్ తో రాధా...డైలామా కంటిన్యూ...?

ఇక రాధా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాలుపంచుకుంటే జై లోకేష్, జై రాధా అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి.

Update: 2023-08-19 14:21 GMT

విజయవాడలో వంగవీటి వారసుడు రాజకీయం ఎటు అన్నది ఆయన అభిమానులు అనుచరుతతో పాటు మరో రెండు పార్టీలలో కూడా డైలామాగానే ఉంది వంగవీటి రాధా 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈసారి ఆరు నూరు అయినా రాధా పోటీ చేసే సీటు అదేనని ఆయన అనుచరులు బల్లగుద్ది చెబుతున్నారు.

అయితే రాధా ఉన్న టీడీపీలో ఆ సీటు దొరకదు అని అంటున్నారు. సీనియర్ నేత, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా మహేశ్వరరావుకు ఆ సీటు కన్ ఫర్మ్ అయింది అని అంటున్నారు. కావాలంటే రాధాకు తూర్పు సీటు ఇస్తారని అంటున్నారు. కానీ రాధా మాత్రం సెంట్రల్ అనే పట్టుబట్టి కూర్చున్నారు. ఆయన ఈ నెలాఖరు వరకూ చూసి ఏదో డెసిషన్ ప్రకటిస్తారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. లోకేష్ పాదయాత్రలో రాధా పాలుపంచుకుంటారా అన్న డౌట్ అయితే ఒకటి ఉంటూ వచ్చింది. రాధా ఈ మధ్య టీడీపీలో అంత యాక్టివ్ గా లేరు అని అంటున్నారు. ఆరు నెలల క్రితం రాధా చిత్తూరు జిల్లాకు వెళ్ళి మరీ లోకేష్ తో పాదం కలిపారు. నాడు ఆయన విజయవాడ సెంట్రల్ సీటు గురించే చర్చించి ఉంటారని అంటున్నారు.

అయితే ఆరు నెలలు గడిచాయి కానీ రాధాకు హామీ అయితే రాలేదు. లోకేష్ పాదయాత్ర విజయవాడకు వచ్చేసింది. ఇక రాధా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాలుపంచుకుంటే జై లోకేష్, జై రాధా అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. రాధా విషయానికి వస్తే ఆయన జనసేనలో చేరుతారని అంటున్నారు.

ఆ పార్టీలో చేరితే పొత్తులలో భాగంగా పవన్ వత్తిడితో అయినా సీటు దక్కుతుంది అని భావిస్తున్నారు అని అంటున్నారు. అయితే రాధా లోకేష్ తో భేటీ కావడం పాదయాత్రలో పాలు పంచుకోవడం ద్వారా ఏ రకమైన సంకేతాలు ఇచ్చారన్న దాని మీద చర్చ సాగుతోంది. రాధా టీడీపీలో ఉంటారా ఆ పార్టీ కేటాయించే విజయవాడ తూర్పు నుంచే పోటీకి దిగుతారా అన్నది కూడా ఆలోచించాల్సి ఉంది అని అంటున్నారు

అయితే రాధాక్రిష్ణ జనసేన నేత కుమార్తెతో వివాహం చేసుకోబోతున్నారు అని ప్రచారం సాగుతోంది. ఆ వియ్యం కాస్తా ఆయన్ని జనసేనకు దగ్గర చేస్తుందా అన్నది కూడా ఉంది. జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ అయితే రాధా ఇంటికి వెళ్ళి మరీ అప్పట్లో చర్చించి వచ్చారు. అయితే రాధా డెసిషన్ ఏంటి అన్నది ఇంకా తెలియడంలేదు, డైలామా మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది అని అంటున్నారు. మరి లోకేష్ నాలుగు రోజుల పాటు క్రిష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తారు. ఈలోగా రాధా ఇష్యూ ఒక కొలిక్కి వస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.

Tags:    

Similar News