సోము వీర్రాజు తో జగన్ సక్సెస్... రఘురామ కామెంట్స్ వైరల్!

నరసాపురం లోక్ సభ స్థానం టిక్కెట్ రఘురామ కృష్ణంరాజుకు దక్కకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది

Update: 2024-03-25 04:19 GMT

నరసాపురం లోక్ సభ స్థానం టిక్కెట్ రఘురామ కృష్ణంరాజుకు దక్కకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో స్థానికంగా రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇందులో భాగంగా... ఇది చంద్రబాబు మార్కు పాలిటిక్స్ అని, బీజేపీలో ఉన్న టీడీపీ సానుభూతిపరులు రఘురామకు టిక్కెట్ ఇవ్వడంలో అడ్డు తగిలారని కొందరు అభిప్రాయపడుతుంటే... తన లెవెల్ ఏంటో చూపించే ప్రయత్నంలో భాగంగా జగన్ ఇచ్చిన లేటెస్ట్ షాక్ ఇది అని మరికొందరు చెబుతున్నారు. ప్రస్తుతం వెస్ట్ లో ఇదే హాట్ టాపిక్ గా ఉంది! ఈ సమయంలో ట్రిపుల్ ఆర్ స్పందించారు.

అవును... నరసాపురం ఎంపీ టిక్కెట్ తనకు ఇవ్వకపోవడంపై సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఈ మేరకు ఆన్ లైన్ వేదికగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా... తనకు టిక్కెట్ రాకపోవడంపై కొంతమంది సంతోషపడుతుంటే.. ఎక్కువమంది ఆవేదన చెందుతున్నారని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో... తాను ఎటువంటి ఆందోళనలోనూ లేనని, అలా అని ఆనందంలోనూ లేనని ఆర్.ఆర్.ఆర్. తెలిపారు.

ఇక, వైఎస్ జగన్ తనను చంపాలని చూసి ఫెయిల్ అయ్యారని, ఇదే సమయంలో ప్రస్తుతానికి జగన్ కు టెంపరరీగా విజయం దక్కిందని, ఈ సందర్భంగా తన ఓటమిని తాను అంగీకరించాలని, జగన్ ఇలాంటి పనులు చేస్తాడు చేయగలడు అని తనకు అనుమానం ఉందని, మరోపక్క ఎక్కడో నమ్మకం కూడా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా... తన ఓటమిని సంపూర్ణంగా అంగీకరిస్తున్నట్లు రఘురామ కృష్ణరాజు ప్రకటించారు! అయితే... ఇది మూడు అడుగులు వెనక్కి వేయడం మాత్రమే అని తెలిపారు.

ఈ క్రమంలో... రాబోయే రోజుల్లో ప్రజాబలంతో.. జగన్ ని అథఃపాతాళానికి తొక్కకపోతే తన పేరు రఘు కాదని చెప్పుకొచ్చారు! జగన్ మోహన్ రెడ్డి ఇన్ ఫ్లుయెన్స్ వల్ల, సోము వీర్రాజు ద్వారా సక్సెస్ అయినట్లుగా తెలిసిందని తెలిపారు. ఏది ఏమైనా ఇది జగన్ మోహన్ రెడ్డి విజయమని, తన ఓటమి అని రఘురామ కృష్ణంరాజు పునరుద్ఘాటించారు. ఇదే క్రమంలో... రాబోయే రోజుల్లో కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు! తనకు పదవే ముఖ్యం అనుకుంటే.. జగన్ తో పోరాడాల్సిన అవసరం తనకు ఉండేది కాదని స్పష్టం చేశారు.

అనంతరం... ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉందని.. తప్పులను సరిచేసుకోవడానికి అందరికీ సమయం ఉందని.. పార్టీలు కొన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో పార్టీలు అన్యాయం చేశాయి.. ప్రజలు అన్యాయం చేయరు అని అన్నారు. ఏది ఏమైనా... కూటమిలో కీలకంగా ఉన్న బీజేపీని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఫ్లుయెన్స్ చేసి, తనకు టిక్కెట్ దక్కకుండా చేశారని రఘురామ చెప్పడం అంటే... వైఎస్ జగన్ లెవెల్ ని అక్షరాలా వెడెల్పు చేసినట్లేనని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు!

Tags:    

Similar News