ముహూర్తంతో కలిపి ట్రిపుల్.ఆర్ జోస్యం... వైసీపీ నుంచి 50 మంది ఎమ్మెల్యేలు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ ఇంఛార్జ్ ల విషయంలో కీలక మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను మార్చారు.

Update: 2023-12-13 06:31 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ ఇంఛార్జ్ ల విషయంలో కీలక మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను మార్చారు. ఈ సమయంలో కొంతమంది అసంతృప్తులు పార్టీలు మారే ఆలోచన చేస్తున్నారని కథనాలొస్తున్న వేళ... ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వారికి సంబంధించిన నెంబరుతో పాటు వారంతా పార్టీమారే ముహూర్తం కూడా చెబుతున్నారు.

అవును... ఏపీలో అధికార వైసీపీ నుంచి టిక్కెట్ దక్కని పలువురు అసంతృప్తులు పార్టీలు మారే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. ఈ సమయంలో జగన్ తీసుకునే నిర్ణయాల వేనుక సర్వేల ఫలితాలు, కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజల మనోభావాలు, సామాజిక సమీకరణాలు ఉంటాయని.. ఆ నిర్ణయాలు బ్లైండ్ గా తీసుకునేవి కాదనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. అయితే... ఈ సమయంలో సుమారు 35 నుంచి 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఆర్.ఆర్.ఆర్

ఇందులో భాగంగా... ఏకంగా 35 - 50 మంది ఎమ్మెల్యేలు వచ్చే ఏడాది జనవరిలో పార్టీని వీడే అవకాశం ఉందని చెబుతూ కొన్ని గాసిప్స్ వదులుతున్నారు రఘురామ కృష్ణంరాజు. ఇందులో భాగంగా కృష్ణాజిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులే టిక్కేట్లు మాకొద్దంటే మాకొద్దంటున్నారని చెబుతున్నారంటే వైసీపీ మునిగిపోయే పడవ అని రఘురామ చెప్పడం గమనార్హం.

ఇదే సమయంలో ప్రస్తుత శాసనసభ్యుల్లో 75 నుంచి 80 మందిని మారుస్తారని తనకు తెలిసిందని రఘురామ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రయాణిస్తున్న పడవకు చిల్లు పడినప్పుడు ఈతవచ్చిన వారంతా ముందుగా దూకేసి ప్రాణాలు కాపాడుకుంటారని.. అదే విధంగా రాజకీయాలపై సంపూర్ణ అవగాహన ఉన్నవారు, ధైర్యం ఉన్నవారూ దూకేస్తున్నారని చెప్పుకొచ్చారు రఘురామ కృష్ణంరాజు!

Tags:    

Similar News