జనవరిలో ఏపీకి రాహుల్ ...వైసీపీ నుంచి భారీ జంపింగ్స్ ?

జమిలి ఎన్నికలు అంటూ కేంద్రంలోని బీజేపీ హడావుడి చేస్తున్న వేళ కాంగ్రెస్ కూడా జాగ్రత్త పడుతోంది.

Update: 2024-10-19 05:02 GMT

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఏపీ మీద ఫోకస్ పెడుతున్నారు. జమిలి ఎన్నికలు అంటూ కేంద్రంలోని బీజేపీ హడావుడి చేస్తున్న వేళ కాంగ్రెస్ కూడా జాగ్రత్త పడుతోంది. ఎపుడు ఎన్నికలు వచ్చినా కూడా దానికి తగిన విధంగా సిద్ధం కావాలని చూస్తోంది. ఇక దక్షిణాదిన కాంగ్రెస్ తన బలాన్ని మరింతగా పెంచుకోవాలని అనుకుంటోంది.

ముఖ్యంగా ఏపీ నుంచే కాంగ్రెస్ బలోపేతం అయ్యే విధంగా రాహుల్ గాంధీ భారీ స్కెచ్ తోనే వస్తున్నారు అని అంటున్నారు. వైసీపీలో ఉన్న చాలా మంది నేతలు పాత కాంగ్రెస్ వాదులే అన్నది తెలిసిందే. వారు విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ కునారిల్లడంతో వైసీపీలోకి షిఫ్ట్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. వారికి దక్కిందేదో దక్కింది.

ఇపుడు వైసీపీ కష్టాలలో ఉంది. ఆ పార్టీ ఎన్నడూ లేనంతగా ఇబ్బందులు పడుతోంది. మళ్లీ తిరిగి పార్టీ బతికి బట్టకడుతుందా అన్నది కూడా కొందరు సీనియర్లకు డౌట్ గా ఉంది అని అంటున్నారు. అటువంటి వారు టీడీపీ జనసేనలలోకి వెళ్ళి అక్కడ ఇమడలేమని భావిస్తున్నారు.

వారందరికీ జాతీయ స్థాయిలో ఎదుగుతున్న కాంగ్రెస్ ఆశాకిరణంగా కనిపిస్తోందిట. వారిలో చాలా మంది ఇపుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఆ జాబితా పెద్దదిగానే ఉంది అని అంటున్నారు. ఉత్తరాంధ్రా నుంచి చూస్తే కనుక రాయలసీమ దాకా పెద్ద ఎత్తున నేతలు ఉన్నారని అంటున్నారు.

ఇక వీరు కాంగ్రెస్ లో చేరేందుకు కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు అని తెలుస్తోంది. మరో వైపు కాంగ్రెస్ మాజీ ఎంపీలు కొందరు వైసీపీ మీద కన్ను వేసి ఉంచారు అని అంటున్నారు. వారు వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి నాయకులను తీసుకుని వచ్చే బాధ్యతను భుజాన వేసుకున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే రాహుల్ గాంధీ కొత్త ఏడాది అంటే 2025 జనవరిలో సంక్రాంతి పండుగ తరువాత ఏపీలో భారీ టూర్ కి ప్లాన్ చేశారు అని అంటున్నారు. రాహుల్ టూర్ వేళ ఏపీలోని మూడు రీజియన్లలో భారీ సభలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అని అంటున్నారు. ఆ సభలలోనే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరుతారు అని అంటున్నారు. రాయలసీమలో ఒక సభ, అలాగే విజయవాడలో మరో సభ, విశాఖలో మూడవ సభ నిర్వహిస్తారు అని చెబుతున్నారు.

ఇక వైసీపీలో సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రులు ఆ పార్టీలో అసంతృప్తి గా ఉన్న వారు కూడా కాంగ్రెస్ బాట పడతారు అని అంటున్నారు. వీరు కాంగ్రెస్ లో చేరడం వెనక చాలా వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు. జమిలి ఎన్నికలు వస్తే మరో రెండేళ్లలో అధికార యోగం దక్కుతుందన్నది వీరి మొదటి ఆశ.

ఇక ఎక్కువ మంది సీనియర్లు ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తమకు బాగా ఉంటుందని కూడా వీరు తలపొస్తున్నారు. జమిలి ఎన్నికలు అంటూ జరిగితే జాతీయ పార్టీల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని ఇండియా కూటమికి కనుక వేవ్ ఉంటే ఏపీలో తప్పకుండా కాంగ్రెస్ నెగ్గుతుందని కూడా లెక్కలు వేసుకుంటున్న వారు అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు అని అంటున్నారు. మరి వైసీపీ నుంచి జెండా ఎత్తేసే వారి జాబితా వైసీపీ పెద్దలకు తెలుసా అన్నదే ఇక్కడ ఒక ప్రశ్న.

Tags:    

Similar News