రిజర్వేషన్ల రద్దుపై రాహుల్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆయన వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు.

Update: 2024-09-10 06:07 GMT

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆయన వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన రిజర్వేషన్ల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లో ప్రస్తుతం ఆదివాసీలు, దళితులు, ఓబీసీల రిజర్వేషన్లపై ఆందోళన వ్యక్తం చేశారు. వారికి సరైన రిజర్వేషన్లు అందడం లేదని, ప్రాధాన్యత సైతం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధిలోనూ వారి భాగస్వామ్యం నామమాత్రమేనని చెప్పారు.

ప్రతిష్టాత్మక జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ ఈ ప్రసంగం చేశారు. దేశంలో అన్నివర్గాల వారికి పాదర్శకంగా అవకాశాలు దొరికినప్పుడే తాము రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిస్తామని చెప్పారు. కామన్ సివిల్ కోడ్ గురించి ప్రశ్నించగా.. దాని గురించి తాను ఇప్పుడే స్పందించే పరిస్థితి లేదన్నారు.

అంతకుముందు వర్జీనియాలో ప్రవాస భారతీయులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల నాటి పరిస్థితులపైనా మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిన అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల వేళ తమ పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేసి.. తమ నాయకులకు నిధులు ఇవ్వకుండా చేశారని పేర్కొన్నారు. దాని వల్ల కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా విశ్వాసం కోల్పోవాల్సి వచ్చిందని.. కానీ వారిలో ధైర్యం నింపి ఎన్నికలకు వెళ్లినట్లు తెలిపారు. అలాగే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇప్పుడు బీజేపీని చూసి ఎవరూ భయపడడం లేదని, ఇప్పుడు తాను కూడా ప్రధాని ముందుకు వెళ్లి 56 అంగుళాల ఛాతి ఇక చరిత్రే అని చెప్పగలనంటూ వ్యాఖ్యానించారు. మొత్తంగా అమెరికాలో పర్యటనలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడంపై అటు బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. రాహుల్ వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడుతున్నారు.

Tags:    

Similar News