ఫ్లాష్ ఫ్లాష్... వైసీపీ మాజీ మంత్రులకు రాహుల్ గాంధీ ఫోన్ ?

ఏకంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఏపీ వైసీపీలోని ఎంపిక చేసిన ఒక ఎనిమిది బిగ్ షాట్స్ కి ఫోన్ చేశారు అన్నది పెద్ద ఎత్తున వైరల్ న్యూస్ అవుతోంది.

Update: 2024-07-02 00:30 GMT

ఇది అదిరిపోయే వార్తే. దానికంటే ముందు ఫ్లాష్ న్యూస్ గానే చూడాలి. వైసీపీ రాజకీయంగా ఓడి కుదేలైన వేళ దేశంలో భారీగా గ్రాఫ్ పెంచుకుని ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ఏపీ మీద ఫోకస్ చేసింది అని అంటున్నారు. అందులోనూ వైసీపీని టార్గెట్ చేస్తోంది అని అంటున్నారు. వైసీపీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం అయి ఫ్యూచర్ అన్నది అర్థం కాక కొట్టుమిట్టాడుతోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే పాతాళం అంచులను వైసీపీ చూస్తోంది.

తాజా ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఓటమిని ఇవ్వలేదు. పార్టీ ఉనికినే ప్రశ్నించేలా ఉంది. కూకటి వేళ్ళతో వైసీపీ రాజకీయ అస్తిత్వాన్నే పెకిలించేసే విధంగా తీర్పు ఉంది అని అంటున్నారు. ఆ తీర్పుతో కళ్ళు పచ్చబారి మెదడు మొద్దుబారి వైసీపీ మొత్తానికి మొత్తం ఎక్కడో దూరంగా విసిరేసినట్లుగా పడి ఉంది అన్నది ఒక కఠిన విశ్లేషణ.

ఈ నేపధ్యంలో వైసీపీలో బడా నేతలు చాలా మంది ఉన్నారు. వారు ఎక్కడికీ పోలేరు. వారంతా కాంగ్రెస్ బ్లడ్ కి అలవాటు పడ్డవారు. అటు నుంచి వైసీపీ వైపుగా షిఫ్ట్ అయిన వారు. ఇపుడు వారి మీద కాంగ్రెస్ కన్ను పడింది అని అంటున్నారు అధికారంలో వైసీపీ ఉంటే కాంగ్రెస్ ఆ వైపు చూసేది కాదు. కనీసం పలకరించేందుకు కూడా ఆలోచించేది.

ఇక ఈ తరహగా బిగ్ షాట్స్ కూడా కాంగ్రెస్ ని పట్టించుకునేవారు కాదు. కానీ ఇపుడు వైసీపీ భారీ ఓటమి పాలు అయ్యాక ఫ్యూచర్ ఏంటో తెలియక కొట్టుమిట్టాడుతున్న వేళ కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ చిన్న కదుపు కదిపినా రియాక్షన్ వేరే లెవెల్ లో ఉంటుంది అని అంటున్నారు. ఇపుడు అదే జరుగుతోంది అని ప్రచారం సాగుతోంది.

Read more!

ఏకంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఏపీ వైసీపీలోని ఎంపిక చేసిన ఒక ఎనిమిది బిగ్ షాట్స్ కి ఫోన్ చేశారు అన్నది పెద్ద ఎత్తున వైరల్ న్యూస్ అవుతోంది. ఆ ఎనిమిది మంది మాజీ మంత్రులతో రాహుల్ గాంధీ నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడారు అని అంటున్నారు.

రాహుల్ గాంధీ వారితో మాట్లాడడమే కాకుండా పొలిటికల్ గా కావాల్సినంత భరోసా ఇచ్చారని అంటున్నారు. తొందరలో కాంగ్రెస్ అగ్ర నేత పార్టీ వ్యవహారాలు చూసే కేసీ వేణు గోపాల్ మిమ్మల్ని స్వయంగా కలుస్తారు అని రాహుల్ వారితో చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.

ఆ మీదట మీరంతా ఢిల్లీ వస్తే మనమంతా సుదీర్ఘంగా చర్చించుకుందామని రాహుల్ గాంధీ మాట్లాడారని అంటున్నారు. ఇక కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ తరఫున మీకు కావాల్సినంత సపోర్టుతో పాటు మీరు కోరుకునే పదవులు కూడా ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారని అంటున్నారు. గతంలో కాంగ్రెస్ లో ఉన్నపుడు మీకు కాంగ్రెస్ ఏ విధంగా మర్యాద ఇచ్చి మంచి అవకాశాలు ఇచ్చిందో ఇపుడు కూడా అలాగే ఇస్తుంది అని రాహుల్ గాంధీ చెప్పారని అంటున్నారు.

మధ్యవర్తులు లేరు నేరుగా నాతోనే మాట్లాడే అవకాశం ఇస్తాను మీరు ఏమి చేయాలో ఏమి కావాలో అంతా నిర్ణయించుకుని రండి అని రాహుల్ గాంధీ చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇలా అన్ని రకాలైన వరాలతో కూడిన వరమాలను వేస్తూ రాహుల్ గాంధీ వైసీపీకి చెందిన మాజీ మంత్రులతో మాట్లాడారు అని అంటున్నారు.

ఒక విధంగా చూస్తే వైసీపీలో ఉంటూ అనేక పదవులు గతంలో చేపట్టిన వారికి ఇది మంచి ఆఫర్ అని అంటున్నారు. వైసీపీలో ఉంటే రేపు ఏమి జరుగుతుందో తెలియదు. అదే విధంగా చూస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఒత్తిడులు దాడులు ఇబ్బందులు అయిదేళ్ళ పాటు తట్టుకోవాలీ అంటే జాతీయ పార్టీ అండదండలు ఉండాల్సిందే అని భావించే వారికి రాహుల్ గాంధీ నుంచి వచ్చిన ఈ హామీ ఆలోచింపచేసింది అని అంటున్నారు.

కోరి కాంగ్రెస్ లో చేరడం కాదు అటు నుంచే ఆఫర్లు వచ్చాయి కాబట్టి అది కూడా రాహుల్ గాంధీయే స్వయంగా ఆఫర్లు ఇచ్చారు కాబట్టి కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు అని భావించే వారికి మాత్రం ఇది బంపర్ ఆఫర్ అని అంటున్నారు ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు వైసీపీ అధినాయకత్వం ఉదాశీన వైఖరి జగన్ మారని తత్వం ఇవన్నీ ఆలోచించుకున్న వారు అయితే పెద్ద నంబరే ఉన్నారని అంటున్నారు. సో తొందరలోనే భారీ సంఖ్యలో కాంగ్రెస్ లోకి వలస వెళ్లే వారు ఉంటారని అంటున్నారు.

Tags:    

Similar News