రాహుల్ గాంధీ పొలిటికల్ బ్లాస్ట్ స్టేట్ మెంట్!

బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే

Update: 2024-06-18 12:45 GMT

బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీడీపీ, బీజేడీ లు బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీలుగా అవతరించడంతో.. కేంద్రంలో వారి పాత్ర కీలకంగా మారింది. మరోపక్క... ఎన్డీయే ప్రభుత్వం బలహీనంగా ఉందని.. ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ రకరకాల వ్యాఖ్యలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ప్రధాని మోడీ నేతృత్వంలోని కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందని.. ఫలితంగా, దానిలోని కొంతమంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. మోడీ నేతృత్వంలోని కూటమి మనుగడ కోసం ఇబ్బందిపడే అవకాశం ఉంది. అది బలహీనంగా ఉండటంతో ఏ చిన్న సమస్య అయినా ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.

ఇదే సమయంలో విద్వేషాలను వ్యాప్తి చేసి, దాని ఫలితాలను పొంది ఉండొచ్చు కానీ... ఈసారి మాత్రం ఆ ఆలోచనను ప్రజలు తిరస్కరించారని.. అసలు ఎలాంటి వివక్షా లేని పరిస్థితులు ఉంటే కచ్చితంగా ఇండియా కూటమి మెజారిటీ దక్కించ్కొని ఉండేదని రాహుల్ బీజేపీని ఉద్దేశించి అన్నారు. తమ చేతులు కట్టేసిన పరిస్థితుల్లో కూడా గట్టిగా పోరాడినట్లు తెలిపారు.. ఆ సమయంలో ఏమి చేయాలో ప్రజలకు కచ్చితంగా తెలుసని రాహుల్ నొక్కి చెప్పారు.

కాగా... గడిచిన 2014, 2019 రెండుసార్లు జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీకి సొంతంగా మెజారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 240 సీట్ల వద్దే ఆగిపోయిన పరిస్థితి. దీంతో... ఎన్డీయే కూటమి పక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు గతంలో కంటే మురుగైన ప్రదర్శన చేసిన కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు దక్కించుకోగా.. మొత్తం ఇండియా కూటమి 230కి పైగా సీట్లు గెలుచుకుంది.

Tags:    

Similar News