వచ్చే పదేళ్లలో దేశంలో సగం సీఎంలు మహిళలే!

అయితే.. తనను టార్గెట్ చేసే వారంతా రాజకీయ ఎజెండాతోనే ఇదంతాచేస్తున్నారే తప్పించి.. మరో కారణం లేదన్న విషయాన్ని ఆయన పదే పదే ఫ్రూవ్ చేస్తున్నారు.

Update: 2023-12-02 14:30 GMT

కొత్త లక్ష్యాన్ని వెల్లడించారు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ. మోడీ ప్రభతో కొన్నేళ్లుగా మసకబారిన తన ఇమేజ్ ను మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఇందులో భాగంగా ఆ మధ్య దేశం మొత్తం పాదయాత్ర చేయటం ద్వారా.. తన సత్తా చాటే ప్రయత్నం చేశారు. నిజానికి ఈ పాదయాత్ర ముందు వరకు ఆయన్ను అమూల్ బేబీ.. పప్పు.. రాజకుమారుడు లాంటి బిరుదులతో ఆయనపై విమర్శల దాడి చేసేవారు. అయితే.. తనను టార్గెట్ చేసే వారంతా రాజకీయ ఎజెండాతోనే ఇదంతాచేస్తున్నారే తప్పించి.. మరో కారణం లేదన్న విషయాన్ని ఆయన పదే పదే ఫ్రూవ్ చేస్తున్నారు.

దీంతో.. ఆయన గ్రాఫ్ ఈ మధ్యన కాస్తంత మెరుగుపడింది. అయితే.. ఇదేదీ మోడీ ఇమేజ్ కు దాటేసేంత స్థాయి లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇదిలా ఉంటే తాజాగా కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. కీలక వ్యాఖ్య చేశారు. తన తాజా కలను ఆవిష్కరించారు. వచ్చే పదేళ్లలో దేశంలో యాభై శాతం మంది మహిళా ముఖ్యమంత్రులే ఉండే లక్ష్యం గురించి ఆయన మాట్లాడారు. కొచ్చిలో ప్రారంభమైన ఉత్సాహ్ మహిళా కమిషన్ ప్రారంభం సందర్భంగా రాహుల్ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఒక్క మహిళా ముఖ్యమంత్రి లేరన్న ఆయన.. పార్టీలో గొప్ప ముఖ్యమంత్రులు కాగలే లక్షణాలు ఉన్న మహిళా నేతలు చాలామందే ఉన్నారన్నారు. దేశ రాజధానిలో అధికారంలో ఉన్న నేతలంతా కెమేరాలు.. స్పీకర్లు అన్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారని.. తాను మాత్రం వాటిని ప్రజల వైపు చేరుస్తున్నట్లుగా చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. దేశంలో యాభైశాతం రాష్ట్రాల్లో మహిళా సీఎంలు ఉండాలన్న రాహుల్.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ఏ మేరకు సీట్లు కేటాయించారు? అన్న విషయాన్నికూడా చెబితే బాగుంటుంది. అయినా.. దేశ ప్రధాని అయ్యే అవకాశాల గురించి సీరియస్ గా ఆలోచించాల్సిన రాహుల్.. అందుకు భిన్నమైన లక్ష్యాల గురించి ప్రస్తావించటం దేనికి నిదర్శనం?

Tags:    

Similar News