కాంగ్రెస్ టిక్కెట్ కు రాహుల్ సిప్లిగంజ్ దరఖాస్తు... తెరపైకి హాట్ సీట్!?
అయితే గతంలోనే రాహుల్ సిప్లిగంజ్ పొలిటికల్ ఎంట్రీపై కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సమయంలో తాజాగా ఒక ఆసక్తికరమైన ఆంశం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఎమ్మెల్యే టిక్కెట్ కొసం దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తొంది. దీంతో ఇది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో... సిటీ లోని ఒక కీలకమైన నియోజకవర్గానికి ఆయన కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారంట.
అవును... సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తొంది. అయితే గతంలోనే రాహుల్ సిప్లిగంజ్ పొలిటికల్ ఎంట్రీపై కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారని.. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారని.. హైదరాబాద్ లో ఒక కీలక స్థానం నుంచి ఆయన పోటీ ఉండొచ్చని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఆ కథనాలు వాస్తవరూపం దాల్చుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్ లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీచేయడం కొసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
దీంతో... తన గాత్రంతో, తనదైన శైలిలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరి చేత నాటు నాటు స్టెప్పులేయించిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు పీసీసీ గోషామహల్ టిక్కెట్ కన్ ఫాం చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరోపక్క.. సీటు కన్ ఫాం అయిన తర్వాతే రాహుల్ రూల్స్ ప్రకారం దరఖాస్తు చేసుకున్నారనే మాటలు వినిపిస్తుండటం గమనార్హం.
మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అందరి కంటే ముందుగా బీఆరెస్స్ అభ్యర్థుల జాబితాను ప్రకటించటంతో.. అసంతృప్తులంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని అంటున్నారు.
దీంతో ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థులను ఎంపిక చేయడం పీసీసీకి కీలకమైన టాస్క్ అనే అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో తాజాగా రాహుల్ సిప్లిగంజ్ పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది.
కాగా... ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 900 దాటినట్లు తెలుస్తోంది. ఇక గడువు పూర్తయ్యే వరకు వాటి సంఖ్య వేయి దాటుతుందని గాంధీభవన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక దరఖాస్తుల పరిశీలన తర్వాత.. ఆయా స్థానాలకు అభ్యర్థుల్ని పీసీసీ ఎంపిక చేస్తుంది. వాటికి అధిష్టాణం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం మీడియాకు రిలీజ్ చేస్తారు!