ఇండియన్ క్రికెటర్ సంచలన పోస్ట్... నెట్టింట వైరల్ ఇష్యూ!

తాజాగా రాహుల్ తెవాటియా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా "ఆల్ ఐస్ ఆన్ రఫా" వైరల్ గా మారుతున్న వేళ... "ఆల్ ఐస్ ఆన్ హిందూస్ ఇన్ పాకిస్థాన్" అని ఒక పోస్ట్ చేశారు.

Update: 2024-05-30 08:50 GMT

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ సీజన్ 17 ముగిసింది.. జూన్ 2 నుంచి ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతుంది! ఆ సంగతి అలా ఉంటే... ప్రస్తుతం "ఆల్ ఐస్ ఆన్ రఫా" అనే విషయం అంతర్జాతీయంగా తీవ్ర వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ క్రికెటర్ రాహుల్ తెవాటియా ఇన్ స్టా లో ఓ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

అవును... సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే క్రికెటర్స్ లో భారత క్రికెట్ రాహుల్ తెవాటియా ఒకరు. తన అభిమానుల కోసం ఇన్‌ స్టాగ్రామ్‌ లో రెగ్యులర్ గా ఏదో ఒక స్టోరీ పోస్ట్‌ ను చేస్తూనే ఉంటాడు. ఈ సమయంలో తెవాతియా తాజాగా ఇన్‌ స్టాగ్రామ్‌ లో మరొ ఆసక్తికర కథనాన్ని పంచుకున్నారు. దీంతో తెవాటియా మరోసారి వార్తల్లో నిలిచారు.

తాజాగా రాహుల్ తెవాటియా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా "ఆల్ ఐస్ ఆన్ రఫా" వైరల్ గా మారుతున్న వేళ... "ఆల్ ఐస్ ఆన్ హిందూస్ ఇన్ పాకిస్థాన్" అని ఒక పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఇమేజ్ ను షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది.

కాగా... హర్యానాలో జన్మించిన రాహుల్ తెవాటియా మంచి ఆటగాడిగా గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అతను తరచుగా తన వ్యక్తిగత జీవితంలోని ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పంచుకుంటుంటారు. అయితే రాహుల్ తేవతీయ శ్రీరాముని భక్తుడు.. ఇటీవల దర్శనం కోసం అయోధ్యకు కూడా వెళ్లారు.

అద్భుతమైన ఫినిషర్‌ గా పేరుతెచ్చుకున్న రాహుల్ తెవాటియా... ఐపీఎల్ లో పలు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ లు ఆడుతూ కనిపించాడు. ఇందులో భాగంగా... ఈ సీజన్‌ లో మిడిల్ ఆర్డర్‌ లో బ్యాటింగ్ చేసిన తెవాటియా... 12 మ్యాచ్‌ లలో 26.86 సగటు, 145.74 స్ట్రైక్ రేట్‌ తో 188 పరుగులు చేశాడు.

Tags:    

Similar News