భారీ వరద కారణంగా అమెరికాలో బద్దలైన డ్యామ్..

అమెరికాలో వరదలు తీవ్ర రూపం దాల్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు ఈ వరదల తీవ్రతను మరింత పెంచాయి

Update: 2024-06-25 13:33 GMT

భారీ వర్షాల కారణంగా అమెరికాలో డ్యామ్ బద్దలైంది. సుమారు నాలుగు రాష్ట్రాలు వరద బీభత్సంతో అల్లాడిపోతున్నాయి.

అమెరికాలో వరదలు తీవ్ర రూపం దాల్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు ఈ వరదల తీవ్రతను మరింత పెంచాయి. దీంతో ప్రవాహ తీవ్రత తట్టుకోలేక బద్దలైన డ్యామ్ కారణంగా జనవాసాల్లోకి నీరు వచ్చి చేరింది.ఐయోవా, సౌత్ డకోటా, మిన్నెసోటా, నెబ్రాస్కా రాష్ట్రాల్లో ఈ వరద బీభత్సం తీవ్రంగా సుమారు 30 లక్షలకు పైగా ప్రజలు ఈ వరదలు చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మిన్నెసోటాలో బ్లూఎర్త్ కౌంటీలో ఉన్న ది ర్యాపిడాన్ డ్యామ్ వరద తీవ్రత తట్టుకోలేక బద్దలైంది. జనవాసాలలోకి మీరు అధికంగా వచ్చి చేరడంతో అధికారులు సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలించారు. వరద కారణంగా డ్యామ్ లో కొంత భాగం దెబ్బతిన్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికి కూడా భారీ వర్షాల కారణంగా దక్షిణ మిన్నెసోటా ప్రాంతం వరదలు చిక్కుకొని ఉంది.

ఐయోవాలో ఈ వారాంతరంలో సంభవించిన వరదల కారణంగా ఓ వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సుమారు 383 మందిని వరద నుంచి కాపాడారు. ఇటువంటి వరద తాము ఊహించలేదు అని సియోక్స్ నగర ఫైర్ మార్షల్ పేర్కొన్నారు. వరద తాకిడికి ఈ ప్రాంతంలోని రైలు రోడ్డు వంతెన కూడా గొప్ప కూలిపోయింది.

ఈ వంతెన ఐయోవా నుంచి దక్షిణ డకోటాలోని ప్రాంతాలను కలుపుతుంది. ఈసారి వచ్చిన వరదలు 1993లో వచ్చిన భయానక వరదలను ప్రజలకు మరొకసారి గుర్తుచేసాయి అని ఐయోవా గవర్నర్ కిమ్ రేనోల్డ్స్ పేర్కొన్నారు. వరద ఉధృతి కారణంగా ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతోంది. ఈ భారీ వరదలకు తీవ్రమైన వర్షాలే కారణం. విడతల వారీగా భారీగా కురిసిన వర్షపాతం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. అని వాతావరణ నిపుణుడైన జోసఫ్ పేర్కొన్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాలు వరదలో చిక్కుకొని ఉన్నాయి.

భారీ వర్షాలు చాలావరకు తగ్గినప్పటికీ ఇంకా మంకాటో, దక్షిణ మిన్నెసోటా, సౌత్ డకోటా,అయోవాలోని పలు ప్రాంతాలలో వరద హెచ్చరికలను ఇప్పటికీ అమలులో ఉన్నాయి. బ్లూ ఎర్త్ రివర్ డ్యామ్ పడమటి వైపున తీవ్రంగా దెబ్బతినడంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం వరద ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. డ్యామ్ కు సంబంధించిన రిపేర్ వర్క్ ఫాస్ట్ గా పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News