ఉద్యోగం : ఎలుకలు పడితే ఏడాదికి రూ.1.2 కోట్లు
ఎలుకలు పట్టేవారిని చులకనగా చూడకండి. ఆ ఉద్యోగానికి కూడా ఇప్పుడు పెద్ద డిమాండ్ ఉంది.
ఎలుకలు పట్టేవారిని చులకనగా చూడకండి. ఆ ఉద్యోగానికి కూడా ఇప్పుడు పెద్ద డిమాండ్ ఉంది. అలాగని అత్తెసరు జీతం కాదండోయ్. ఏడాదికి ఏకంగా రూ.1.2 కోట్ల పారితోషికం.
ఇది మరెక్కడో కాదు అమెరికాలోని ప్రతిష్టాత్మక న్యూయార్క్ నగరంలో. గత కొన్నాళ్ళుగా న్యూయార్క్ లో ఎలుకల బాధ ఏకంగా మీడియాకు కూడా ఎక్కింది. సబ్ వేలు, డ్రైనేజీలు, పార్కులు ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా ఎలుకలు ఉన్నాయి. వాటి సంతతి విపరీతంగా పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ‘ర్యాట్ క్యాచర్’ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాడు. దీనికి 900 మంది ధరఖాస్తు చేసుకున్నారు. వారిలో కేథలిన్ కొరాడీని ఈ ఉద్యోగానికి ఎంపిక చేశారు.
ఆమె గతంలో ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమెకు ఎలుకల నియంత్రణ, వాటికి ఆహారం, నీళ్లు అందకుండా చూడటం వంటి అంశాలపై పనిచేసిన అనుభవం ఉందట.
ఎలుక పట్టే పనే కదా ఇంత ఎలుకల మందు పెడితే అయిపోతుందని అనుకుంటున్నారేమో. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. ఎలుకల మీద ఎలాంటి విషప్రయోగం చేయకూడదు. గతంలో అలా చేయడం మూలంగా ఇతర జీవులు చనిపోయాయి.
అందుకే ఎలుకలను నివారించే కార్యక్రమంలో భాగంగా ఆమె ఇళ్లలో మిగిలిపోయే ఆహారం, చెత్తను ఎలుకలకు అందకుండా చేయాలి. సబ్ వేలలో ఎలుకల ఆవాసాలు లేకుండా చూడాలి.