తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నంపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అవును... తెలంగాణలో రాష్ట్ర గీతం, చిహ్నం మార్చడం అనే సంచలన నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్

Update: 2024-05-30 15:28 GMT

తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీజేఎస్ నేతలు హాజరయ్యారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పు, తెలంగాణ అధికారిక గీతంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమావేశానికి హాజరైన నేతలకు రేవంత్ వివరించారు.

అవును... తెలంగాణలో రాష్ట్ర గీతం, చిహ్నం మార్చడం అనే సంచలన నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్! ఈ క్రమంలో మిత్రపక్షాలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం స్పందించిన రేవంత్... తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, జూన్‌ 2న "జయ జయహే తెలంగాణ" గేయం జాతికి అంకితం చేస్తామని అన్నారు.

ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర చిహ్నంపైనా రేవంత్ స్పందించారు. ఇందులో భాగంగా... రాష్ట్ర అధికార చిహ్నాన్ని ఇంకా ఖరారు చేయలేదని ఆయన వెల్లడించారు. అయితే... తెలంగాణ రాష్ట్ర చిహ్నంపై ఎలాంటి భేషజాలు, పంతాలు తమకు లేవని.. అందరి సూచనలు తీసుకుంటామని.. అవసరమైతే అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు.

కాగా... సచివాలయంలో కాంగ్రెస్ నేతలతోపాటు సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతంపై కాంగ్రెస్, మిత్రపక్ష నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన బృందం "జయ జయహే తెలంగాణ" గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా ఈ గీతాన్ని రచించిన అందెశ్రీ స్పందించారు. ఇందులో భాగంగా... గీతంలో చేసిన మార్పులను వివరించారు. ఈ క్రమంలోనే 13 చరణాలతో ఉన్న పూర్తి గీతం నిడివి 13:30 నిమిషాలు ఉంటుందని.. అయితే చరణాలు తగ్గించి రెండున్నర నిమిషాలతో రూపొందించిన గీతాన్ని కూడా వినిపించారు.

Tags:    

Similar News