తెలంగాణ నేతలకు సోనియా ఝలక్ !

దీనికి అగ్ర నాయకురాలు సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ఆహ్వానించారు.

Update: 2024-05-27 07:06 GMT

యూపీఎ హయాంలో తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత పదేళ్లకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. దీనికి అగ్ర నాయకురాలు సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ఆహ్వానించారు.

అయితే తాజాగా జూన్ 2 వేడుకలకు రావడం లేదని తెలంగాణ నేతలకు సోనియాగాంధీ కార్యాలయం సమాచారం ఇచ్చింది. దీంతో ఎంతో ఊహించుకున్నా కాంగ్రెస్ నేతలు ఉసూరుమంటున్నారు. అయితే ఈ వేడుకలకు తన సందేశాన్ని పంపనున్నారు సోనియా గాంధీ.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ వస్తారని కాంగ్రెస్ నేతలు భావించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఇప్పటికే సీఈసీ కూడా షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. సికింద్రాబాద్‌‌ లోని పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఈసీ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో అందుకు తగ్గ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జయజయహే తెలంగాణ గీతాన్ని కీరవాణి సంగీత దర్శకత్వంలో రేవంత్ తీసుకువస్తున్నారు. దానిని స్వయంగా పర్యవేక్షించడం విశేషం.

Tags:    

Similar News