కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తోంది...రేవంత్ చెప్పింది ఇదే...!
ఏ సర్వే చూసినా కాంగ్రెస్ దే అధికారం అంటోంది అని తెలంగాణా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు
ఏ సర్వే చూసినా కాంగ్రెస్ దే అధికారం అంటోంది అని తెలంగాణా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలు అన్నీ కూడా హస్త రేఖలు బాగున్నాయని చెబుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇంతకు ముందు వచ్చిన సర్వేలు కాంగ్రెస్ కి అనుకూల గాలి ఉందని చెబితే ఇపుడు ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెస్ దే తెలంగాణా పీఠం అని అంటున్నాయి.
దీంతో రేవంత్ రెడ్డి సంబరం అంబరాన్ని దాటుతోంది. దొరల తెలంగాణా పోతోంది, ప్రజల తెలంగాణా రాబోతోంది అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. డిసెంబర్ 3న వచ్చే రియల్ రిజల్ట్స్ కాంగ్రెస్ కి పట్టాభిషేకం చేయబోతున్నాయని ఆయన అంటున్నారు. డిసెంబర్ 3న శ్రీకాంత్ రెడ్డి ప్రాణ త్యాగం చేశారు అదే రోజు కాంగ్రెస్ విజయ ఢంకా మోగించబోతోంది అని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.
ఇక కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9న అధికారం చేపట్టబోతోంది అని ఆయన స్పష్టం చేశారు. మేము అధికారంలోకి వచ్చేస్తున్నామని రేవంత్ అంటున్నారు. అందుకు తార్కాణం ఏ సర్వే చూసినా కాంగ్రెస్ హవాయే అని ఆయన అంటున్నారు. మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతున్నామని రేవంత్ అంటున్నారు.
మొత్తానికి అన్ని సర్వేలూ కాంగ్రెస్ కి ఆధిక్యతనే ఇవ్వడం విశేషం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలు కచ్చితంగా చెబుతున్నాయి. దాంతో కాంగ్రెస్ శ్రేణులలో ఆనందం వ్యక్తం అవుతోంది. ప్రజలు మార్పు కోరుకున్నారని అంటున్నారు. అది కాంగ్రెస్ కి విజయం అందించబోతోంది అని అంటున్నారు. ఆ ఫలితాలను డిసెంబర్ 3న అధికారికంగా అంతా వింటారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సో తెలంగాణా జనాలు విలక్షణమైన తీర్పుని ఈసారి ఇవ్వబోతున్నారు అన్న మాట.