బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసే ఛాన్స్: రేవంత్ షాకింగ్ కామెంట్స్
తాజాగా మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. అసెంబ్లీలో ఈ రోజు జరిగిన వివాదంపై స్పందించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇదేమీ కొత్తకాదని కూడా వ్యాఖ్యానించా రు. తాజాగా మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. అసెంబ్లీలో ఈ రోజు జరిగిన వివాదంపై స్పందించారు. ఇదేసమయంలో బాధ్యతలేని విపక్షం కారణంగానే సభ సజావుగా సాగడం లేదని చెప్పారు. ఈ సమయంలోనే ఆయన కొందరు సభ్యులపై వేటు తప్పకపోవచ్చన్నారు.
గతంలో సంపత్‌కుమార్, వెంకటరెడ్డి సభ్యత్వాలు రద్దు చేసిన విషయాన్నిరేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కొత్త సంప్రదాయాలను సభలో ప్రవేశ పెట్టింద ని.. ఆ నాడు కనీసం మైకు కూడా తనకు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఆసంప్రదాయాలను తాము కొనసాగి స్తే.. ఎవరికీ మైకు వచ్చేది కాదన్నారు.కానీ, తాము విలువలు, ప్రజల తీర్పునకు విలువ ఇచ్చామన్నారు. అందుకే మైకు అందరికీ ఇచ్చామని చెప్పారు.
కేటీఆర్, హరీష్ రావులు.. ఏకంగా 6 గంటల సమయం మాట్లాడారని.. ఒక్క జగదీష్‌రెడ్డే 70 నిమిషాల పాటు మాట్లాడారని.. అందరికీ మైకు ఇచ్చే సంప్రదాయం కొనసాగిస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ సభకు ఎందుకురావట్లేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇలాంటి వారికి ఫ్లోర్ లీడర్ పదవి దండగని వ్యాఖ్యానించారు. అధికారం లేకపోతే.. ప్రజలు ఎందుకు? అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నడని అన్నారు. ఫ్లోర్ లీడర్ పదవిని కేటీఆర్ కో.. హరీష్‌రావుకో ఇచ్చేస్తే బెటర్ కదా! అని వ్యాఖ్యానించారు.
సబితక్క అలా చేసుడెందుకు?
ఇక, బుధవారం నాటి సభలో మాజీ మంత్రి సబిత వ్యవహారం.. ఆమె కన్నీరు పెట్టుకున్న విషయంపై రేవంత్ రెడ్డి రియాక్ట్ అవుతూ.. లేనిపోని విషయాలు సభలో చర్చించారని అన్నారు. తనను కాంగ్రెస్‌లోకి తీసుకుని తాను మాత్రం బీఆర్ ఎస్ లోకి వెళ్లిపోయారని.. ఇదిమోసంకాదా? అని అన్నారు. అయితే..అ సలు ఆ విషయాలు తాను ప్రస్తావించ లేదని.. సబితక్కే ప్రస్తావించారని అందుకే ఉన్నదేదో సమయం వచ్చినప్పుడు చెప్పాలె గదా! అని చెప్పేసినట్టు తెలిపారు. సబితక్క ఆవేదన చూసైనా కేసీఆర్, హరీష్‌రావు అండగా నిలవాలని సూచించారు.