జ్యూవెలరీ స్టోర్ లో దోపిడీ.. క్రైమ్ థ్రిల్లర్ సన్నివేశాన్ని తలపించే వీడియో!

అవును... తాజాగా చికాగోలోని దర్బార్ జ్యూవెలర్స్ దోపిడీకి గురైంది.

Update: 2024-09-19 06:13 GMT

గత మే నెలలో జార్ జ్యూవెలర్స్ లో నల్లటి రంగులోని దుస్తులు, మాస్క్, హుడీ లు ధరించిన ముగ్గురు వ్యక్తులు సుత్తిని ఉపయోగించి జ్యూయలరీ షాపును బద్దలు కొట్టారు. ఆ దోపిడీ తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి అదే తరహా దోపిడీ జరిగింది. దీంతో... దీన్ని రాబరీ సిరీస్ గా పలువురు అభివర్ణిస్తున్నారు.

అవును... తాజాగా చికాగోలోని దర్బార్ జ్యూవెలర్స్ దోపిడీకి గురైంది. ఆదివారం సాయంత్రం నల్లటి దుస్తులు, ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు సుత్తితో జ్యూవెలరీ షాప్ అద్దాలు బద్దలుకొట్టారు. ఆ షాపులో భారీగా నగలు దోచుకుని వెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్ సన్నివేశంలోలాగా ఇవి ఉన్నాయి.

2642 వెస్ట్ డెవాన్ లోని దర్బార్ జ్యూవెలర్స్ లో జరిగిన ఈ దోపిడీలో దుండగులు సుమారు 1,00,000 డాలర్ల కంటే ఎక్కువ విలువైన నగలు దోచుకెళ్లారని అంటున్నారు. అయితే ఈ దోపిడీకి సంబంధించిన దృశ్యాలు చూసినవారు సరిగ్గా నాలుగు నెలల క్రితం జార్ జ్యూవెలర్స్ లో జరిగిన దోపిడీకి ఇది కొనసాగింపనే కామెంట్లు చేస్తున్నారు.

దీంతో... ఇది జూవెలర్ షాపుల దోపిడీ సిరీస్ కి ప్లానింగ్ అనే విషయాన్ని కొట్టిపారేయలేమని అనేది ఈ సందర్భంగా పలువురి అభిప్రాయంగా ఉంది. దాదాపు అదే డ్రెస్ కోడ్ లో, అదే తరహా సుత్తి దెబ్బలతో ఎంట్రీ ఇచ్చి, ముగ్గురు దుండగులు చేసిన ఈ దోపిడీలు స్థానిక బంగారు వ్యాపార వేత్తల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News