ఎంఐ ని వెంటాడుతున్న ఫ్యాన్స్... కొత్త "ట్రెండ్" తెలుసా?
ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు నెట్టింట ఫ్యాన్స్ రోహిత్ - ఎంఐ ఇష్యూని వెంటాడుతున్నారు
భారత్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2024 సందడిలో భాగంగా రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్.. మధ్యలో ఫ్యాన్స్ అనే చర్చ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంఘా... రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా చేసిన తర్వాత ట్విట్టర్, ఇన్ స్టా లో లక్షల మంది ఫ్యాన్స్ అన్ ఫాలో అవుతున్నారు. ఈ సమయంలో మరిన్ని కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి.
అవును... రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో ముంబై ఇండియన్స్ పై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వారిని సర్ధిచెప్పడం ముంబైకి కీలకంగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వీరి ప్రభావం మైదానంలో మ్యాచ్ పై కూడా కనిపించే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్న వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా రోహిత్ శర్మ ఫ్యామిలీ ఫోటోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది ఎంఐ.
ముంబై ఇండియన్స్ తన ఇన్ స్టాగ్రాం లో రోహిత్ శర్మ దంపతుల ఫోటోను పోస్ట్ చేసింది. ఈ రోజు రోహిత్ శర్మ భార్య రితిక పుట్టిన రోజు కావడంతో ఆమెకు పుట్టినరోజు శుభాకాక్షలు చెబుతూ ఎంఐ ఇద్దరి ఫోటోనూ పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ఎప్పటికీ మా నంబర్ వన్ సపోర్టర్" అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో... ఫ్యాన్స్ ను కూల్ చేసే పనిలో భాగంగా ఎంఐ ఈ స్టెప్ తీసుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు నెట్టింట ఫ్యాన్స్ రోహిత్ - ఎంఐ ఇష్యూని వెంటాడుతున్నారు. ఇందులో భాగంగా "రోహిత్... ముంబై ఇండియన్స్ ని వదిలెయ్" అంటూ నెట్టింట పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. దీంతో "రోహిత్ లీవ్ ఎంఐ" అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. తనను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన ఎంఐ ని వీడాలని రోహిత్ ను ఫ్యాన్స్ కోరుతున్నారు.
మరోపక్క... కెప్టెన్సీ మార్పుతో అసంతృప్తిగా ఉన్న సీనియర్ క్రికెటర్లు జస్ ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ తోపాటు ఇషాన్ కిషన్ కూడా ముంబై ఇండియన్స్ జట్టు నుంచి బయటకు వచ్చేస్తారనే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఎంఐ స్పందించింది. అవన్నీ నిరాధారమైనవిగా కొట్టిపడేసింది. అసలు ఇలాంటి ప్రచారం ఎలా మొదలవుతుందో అర్థం కావడం లేదని మొత్తుకుంటుంది!
దీంతో... ముంబై ఇండియన్స్ – రోహిత్ శర్మ కెప్టెన్సీ... మధ్యలో అభిమానులు అనే అంశం ఐపీఎల్ - 2024 ప్రారంభమయ్యే వరకూ కూడా వార్తల్లో నిలిచే అంశంగానే కనిపిస్తుంది. మరి మొదలయ్యాక ఎలాంటి ప్రభావం చూపించబోతుందనేది వేచి చూడాలి!