వదల బండారూ..వదల... రోజా పరువు నష్టం దావా...!

మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి మీద మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజా పరువు నష్టం దావా వేశారు.

Update: 2023-11-21 15:52 GMT

మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి మీద మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజా పరువు నష్టం దావా వేశారు. కొద్ది నెలల క్రితం బండారు విశాఖలో మీడియా మీటింగ్ పెట్టి మరీ రోజా మీద అసభ్య పదజాలంతో దూషించారు. ఆమె మీద ఎవరూ అనలేని వినలేని మాటలను అన్నారు.

దాంతో వైసీపీ వర్సెస్ టీడీపీ గా వార్ సాగింది. దానికి గానూ బండారుని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆయన బెయిల్ మీద వచ్చారు. ఇంతటితో ఈ కధ సమాప్తం అని అంతా అనుకున్నారు. కానీ రోజా మాత్రం వదల బండారూ వదల అంటున్నారు.

ఆమె తాజాగా నగరి కోర్టులో మాజీ మంత్రి మీద పరువు నష్టం దావా వేశారు. బండారు తన మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అని ఆమె దావా వేసిన సందర్భంగా పేర్కొన్నారు. బండారు తో పాటు నగరి కి చెందిన టీడీపీ నేత గాలి భాను ప్రకాష్ మీద కూడా ఆమె కేసు వేశారు.

దీంతో బండారు విషయం ఇపుడు కోర్టుల దాకా వెళ్ళింది. అలాగే మంత్రి ఆర్కే రోజా న్యాయ పోరాటం కూడా ఆసక్తిగా మారింది. బండారు తన మీద చేసిన కామెంట్స్ కి కోర్టు ద్వారా తేల్చుకుంటాను అని ఆమె అప్పట్లో మీడియా ముఖంగా చెప్పారు. చెప్పిన మాట మేరకు ఆమె ఇపుడు కోర్టుని ఆశ్రయించారు.

బండారు అప్పట్లో రోజా మీద దారుణమైన కామెంట్స్ చేశారు. మొదట్లో వైసీపీ నేతలు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. కానీ టాలీవుడ్ డైరెక్టర్ రాం గోపాలవర్మ దీన్ని లేవనెత్తారు. మంత్రి మీద ఒక నాయకుడు ఇలా దారుణంగా కామెంట్స్ చేస్తే ఇక సాధారణ మహిళల సంగతేంటి అని ఆయన ప్రశ్నించారు.

దాంతో వివాదం రాజుకుంది. ఎట్టకేలకు పోలీసులు హై డ్రామా నడుమ బండారుని అరెస్ట్ చేసి కోర్టులు తరలిస్తే గుంటూరు కోర్టు బెయిల్ ఆయనకు ఇచ్చింది. మరి ఇపుడు బండారు న్యాయ పోరాటం చేయాల్సి ఉంది. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని మీడియా ముందు చెప్పిన బండారు ఇపుడు రుజువు చేసుకోవాల్సి ఉంది.

బండారుకు సంఘీభావం తెలిపిన టీడీపీ పెద్దలు ఆయన న్యాయపోరాటానికి ఎంతవరకూ మద్దతు ఇస్తారో చూడాలి.ఇదిలాఉంటే రోజా మంత్రిగా ఉన్నా మాజీ మంత్రి తన మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు పార్టీ పరంగా పెద్దగా మద్దతు దక్కలేదని భావించారని అంటారు.

చివరకి ఆమె తానుగానే న్యాయపోరాటానికి సిద్ధం అయ్యారు. న్యాయం గెలుస్తుందని బండారుకు తగిన శిక్ష పడుతుందని మంత్రి వర్గీయులు ఆశాభావంతో ఉన్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News