షర్మిళకు పెద్ద పనే అప్పగించిన రోజా.. కామెంట్స్ వైరల్!

ఈ క్రమంలో తాజాగ వైఎస్ షర్మిళ చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి ఆర్కే రోజా తనదైన శైలిలో ఫైరయ్యారు.

Update: 2024-02-09 09:14 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. వాస్తవానికి ఇది నిన్నమొన్నటివరకూ వైసీపీ వర్సెస్ టీడీపీ & కో గా ఉన్న నేపథ్యంలో... ఇటీవల వైఎస్ షర్మిళ ఎంట్రీతో కొత్త రూపు సంతరించుకుంది. ఈ క్రమంలో తాజాగ వైఎస్ షర్మిళ చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి ఆర్కే రోజా తనదైన శైలిలో ఫైరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఒక పెద్ద పని అప్పగించారు.

అవును... ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ వైఎస్ షర్మిళ చేస్తున్న విమర్శల సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ లక్ష్యంగా.. వైసీపీ సర్కార్ టార్గెట్ గా ఆమె చేస్తున్న విమర్శలు రోజు రోజుకీ తీవ్రమవుతున్నాయి. పైగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి ఎలాంటి అన్యాయమూ చేయలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయని అంటున్నారు!

ప్రధానంగా... వైఎస్సార్ కుమారుడైన జగన్ ని జైల్లో పెట్టినప్పుడు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసింది ఆమెనే కదా అంటూ ఫైరయవుతున్నారు వైఎస్ ఫ్యామిలీ అభిమానులు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా వైఎస్ షర్మిలపై మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయారు. వైఎస్ షర్మిళ ఇప్పుడున్న పార్టీ గురించి ప్రస్థావించడం నుంచి, వైఎస్సార్టీపీని మూసివేయడంతోపాటు.. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బాకీలపైనా ఆమె స్పందించారు.

ఇందులో భాగంగా... షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో అందరూ గమనించాలి.. అసలు జగన్ ను జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలపడం ఎంటి? అని ప్రశ్నిస్తూ మొదలుపెట్టిన మంత్రి ఆర్కే రోజా... ఏపీలో పర్యటనలు చేస్తూ వైఎస్ జగన్ సర్కార్ పై షర్మిళ చేస్తున్న విమర్శలపై స్పందించారు.. వాటిని పూర్తిగా తప్పుబట్టారు.ఇదే సమయంలో... ఏ లబ్ది పొందడానికి కాంగ్రెస్ తరపున ఆంధ్రాలో ప్రచారం చేస్తున్నారో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.

వైఎస్ కుటుంబాన్ని ఎన్నో ఇబ్బంద్లు పెట్టిన పార్టీలోకి ఏ మొహం పెట్టుకుని చేరారో షర్మిల సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా షర్మిళకు ఒక టాస్క్ అప్పగించారు రోజా. ఇందులో భాగంగా... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి... ఆ రాష్ట్రం నుంచి ఏపీకి రావాల్సిన 6 వేల కోట్లు ఇప్పించాలంటూ షర్మిళంకు పెద్ద పని అప్పగించారు రోజా. ఇదే సమయంలో వైఎస్సార్టీపీని ఎందుకు కాంగ్రెస్ లో విలీనం చేశారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News