పిన్నెల్లి అరెస్ట్ వార్తలపై సంగారెడ్డి ఎస్పీ రియాక్షన్ ఇదే!

ఇందులో భాగంగా... ఈ ఎగ్జాట్ లోకేషన్‌ గురించి మాచర్ల పోలీసులు.

Update: 2024-05-22 12:17 GMT

ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్‌ హౌస్‌ లో రామకృష్ణారెడ్డిని, అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్‌ హౌస్‌ లో రామకృష్ణారెడ్డిని, అతని సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ ఎగ్జాట్ లోకేషన్‌ గురించి మాచర్ల పోలీసులు. పటాన్‌ చెరు పోలీసుల సహకారం తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకోగలిగాని అంటున్నారు. ఈ విషయాలపై తాజాగా సంగారెడ్డి ఎస్పీ స్పందించారు.

అవును... మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారంటు వస్తున్న వార్తలపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ స్పందించారు! ఇందులో భాగంగా ఈ అరెస్ట్ పై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. అయితే... ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనను అరెస్ట్ చేయాలని తమతో ఏపీ పోలీసులు చెప్పినట్లు మాత్రం ఎస్పీ రూపేష్ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే కోసం గాలిస్తున్నామని, అదుపులోకి తీసుకున్నట్లు తమకే తెలియదని అన్నారు. కాగా... మే 13 పోలింగ్‌ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెంటచింతల మండలంలో ఈవీఎంను ధ్వంసం చేశారనే ఆరోపణలపై ఎమ్మెల్యే పిన్నెల్లిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Tags:    

Similar News