చెవి రింగులు కావు.. అమ్మాయిలకు సరికొత్త రక్ష

అమ్మాయిల భద్రతకు కొండంత అండగా ఉండేలా చెవులకు పెట్టే రింగుల రూపంలో ఒక ఆయుధాన్ని రూపొందించారు. ఇంతకీ ఆ జుంకాలేమిటి? దాని స్పెషల్ ఏమిటి?

Update: 2024-03-10 05:22 GMT

అమ్మాయి అన్నంతనే.. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే కామన్ అంశం.. వేధింపులు. వీటి నుంచి తప్పించుకోవటానికి ఒక్కొక్కరు ఒక్కో తీరును ఫాలో అవుతుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికను ఆధారంగా చేసుకొని ఒక వినూత్న రక్షణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అదిప్పుడు ఉత్తరప్రదేశ్ లో అందరి చూపు పడేలా చేయటమే కాదు.. మిగిలిన వారంతా దీని గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.

అమ్మాయిల భద్రతకు కొండంత అండగా ఉండేలా చెవులకు పెట్టే రింగుల రూపంలో ఒక ఆయుధాన్ని రూపొందించారు. ఇంతకీ ఆ జుంకాలేమిటి? దాని స్పెషల్ ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే.. అవి బ్లూటూత్ జుంకాలు. బ్యాటరీతో కూడిన ఈ బ్లూటూత్ మాడ్యూల్.. రెండు స్విచ్ లు.. చిన్న స్టీల్ పైపు తో కూడిన ఈ అందమైన జుంకులా స్పెషాలిటీ ఏమంటే.. ఆపదలో ఉన్నప్పుడు.. వారున్న లొకేషన్ ను తమ వారికి తెలిసేలా ఏర్పాట్లు ఉండటమే.

బీటెక్ మొదటి సంవత్సరంలో ఉన్న నలుగురు ఇంజినీరింగ్ అమ్మాయిలు తయారు చేసిన ఈ వినూత్న జుంకాలు ఇప్పుడు అందరి చూపు పడేలా చేస్తున్నాయి. 35 గ్రాముల బరువు ఉన్న ఈ జుంకాల తయారీకి రూ.1650 మాత్రమే ఖర్చు అవుతుంది. ఆఫ్రీన్ ఖాతూన్.. భమీబా.. రియాసింగ్.. ఫాయా నూరీ అనే నలుగురు అమ్మాయిలు కలిసి సరికొత్త గా ఏమైనా చేద్దామన్న ఆలోచనతో మొదలైన వారి ప్రయాణం.. బ్లూటూత్ జుంకాలు (చెవిపోగులు) తయారు చేసేలా చేశారు.

చూసేందుకు సాదాసీదా జుంకాలుగా కనిపించినా.. ఆపదలో ఉన్న వేళలో.. వీటికి అమర్చిన చిన్న బటన్ ను నొక్కటం ద్వారా.. వీరు ఉండే లొకేషన్ తో పాటు.. వారు ముందే సిద్ధం చేసుకున్న తమ కుటుంబీకులకు సమాచారం అందించేలా వీటిని రూపొందించారు. రెండు అలారం స్విచ్ లు అమర్చటంతో పాటు.. మూడు ఎమర్జెన్సీ నెంబర్లను ఫీడ్ చేసేకునే సదుపాయాన్ని కల్పించారు. ఒక స్విచ్ నొక్కితే అత్యవసర నంబర్లకు లొకేషన్ సేర్ కావటం.. మరో స్విచ్ నొక్కితే ఆకతాయిలపై మిరియాలు.. మిర్చీ బుల్లెట్ల పిచికారీ జరిగేలా వీటిని సిద్ధం చేశారు. అందరిని ఆకర్షిస్తున్న ఈ జుంకాల్ని.. పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తే.. మహిళలకు రక్షగా మారతాయనటంలో సందేహం లేదు.

Tags:    

Similar News