ముంబై హీరోయిన్ వ్యవహారం... సజ్జల స్ట్రాంగ్ రియాక్షన్!

ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని కథనాలు హల్ చల్ చేస్తున్నాయి.

Update: 2024-08-27 10:22 GMT

ముంబైకి చెందిన ఓ సినీ నటితో కృష్ణాజిల్లాకు చెందిన వైసీపీ నేత సాగించిన వ్యవహారానికి సజ్జల సపోర్ట్ అంటూ ఎల్లో మీడియా లో వచ్చిన వార్త తరువాత ఈ ఇష్యూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ప్రస్తుతం నెట్టింట టీడీపీ, వైసీపీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఈ సమయంలో తనపై వస్తోన్న ఆరోపణలపై సజ్జల స్పందించారు.

అవును... కృష్ణాజిల్లాకు చెందిన వైసీపీ నేత ఒకరు.. ముంబై కి చెందిన సినీనటిని ప్రేమపేరుతో లొంగదీసుకున్నారని.. తర్వాత పెళ్లి చేసుకోకుండా మోసగించారని.. తమకున్న అధికార బలాన్ని ఉపయోగించి బాధితురాలితో పాటు ఆమె తల్లితండ్రులపైనా అక్రమ కేసులుపెట్టి జైలుకు పంపించారని ఓ వార్త టీడీపీ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. ఇలా కొన్ని పత్రికల్లోనూ, మీడియా ఛానల్స్ లోనూ వచ్చిన కథనాలను ఉంటంకిస్తూ టీడీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతుంది.. జగన్ పైనా, సజ్జల పైనా తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. ఈ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

ఇందులో భాగంగా... "ముంబై నటికి వేధింపులు.. సజ్జల సహాయం". అంటూ పసుపు పత్రికల్లో తనపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నరని.. ఆ పత్రిక కథనాలను పట్టుకుని టీడీపీ, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, మరికొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఆ ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సజ్జల వెల్లడించారు.

తనపై ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని తెలిపరు. అన్యాయంగా, అడ్డగోలుగా తనపై తప్పుడు వార్తలు రాశారని.. తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఇలాంటి కథనం రాసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వైసీపీ ప్రతిష్టను దెబ్బతీస్తూ ఆ పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననం లక్ష్యంగా కథనాలు రాస్తున్నారని ఫైరయ్యారు.

మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం.. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసంతో అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం కూటమి ప్రభుతం, దానికి సంబంధించిన ఎల్లో మీడియా కొత్త పన్నాగం మొదలుపెట్టిందని దుయ్యబట్టారు.

Tags:    

Similar News