రెంటికీ చెడ్డ రేవడి ఎమ్మెల్యే సంజయ్ !

రాజకీయ జీవితం ప్రసాదించిన బీఆర్ఎస్ పార్టీని వీడి రాత్రికి రాత్రే కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు.

Update: 2024-06-26 14:30 GMT

అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినట్లుంది ఆ ఎమ్మెల్యే పరిస్థితి. అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా మారిందని, ఇంటా, బయటా వస్తున్న వ్యతిరేకతను అధిగమించలేక కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తుంది.

రాజకీయ జీవితం ప్రసాదించిన బీఆర్ఎస్ పార్టీని వీడి రాత్రికి రాత్రే కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ ను నమ్ముకుని ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఒక్క మాట కూడా చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో ఆయన భగ్గుమన్నాడు. ఎఏకంగా తన పదవికి రాజీనామా చేసేందుకే సిద్ధమయ్యారు. గత మూడు రోజులుగా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు సముదాయిస్తున్నా ఆయన ఒక్క అడుగు కూడా వెనకకు వేయడం లేదు.

గత పదేళ్లుగా కేసులు పెట్టి వేధించిన నేతను తమకు చెప్పకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. పాత కాంగ్రెస్ నేతలు ఎవరూ ఎమ్మెల్యే సంజయ్ ని దగ్గరకు రానివ్వడం లేదు. ఇక నాతో పాటు కాంగ్రెస్ రావాలని కోరినా ఏ ఒక్క బీఆర్ఎస్ నేతా, ప్రజాప్రతినిధి సంజయ్ వెంట వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. బీఆర్ఎస్ నేతలు కలిసిరాక, కాంగ్రెస్ నేతలు దగ్గరకు రానివ్వక సంజయ్ ఒంటరిగా మిగిలిపోయారని అంటున్నారు. జీవన్ రెడ్డి చల్లబడేది ఎప్పుడో ? ఎమ్మెల్యే సంజయ్ భవిష్యత్ ఏమిటో వేచిచూడాలి.

Tags:    

Similar News