జారి పడిన సారు దెబ్బకు.. రేవంత్ జోరుకు బ్రేకులు!

అందుకు తగ్గట్లే.. గ్రౌండ్ రెఢీ అవుతున్న వేళ.. అనూహ్యంగా బాత్రూంలో జారి పడిన కేసీఆర్ దెబ్బకు సీన్ మొత్తం మారిపోయిందని చెప్పాలి.

Update: 2023-12-14 04:00 GMT

ప్లస్ అనుకున్నవి మైనస్ కావటం. తేడా కొడతాయనుకున్నవి కలిసి రావటం మామూలే. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణలోని ప్రతిపక్ష గులాబీ పార్టీకి ఎదురైందంటున్నారు. ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఓటమి ఎదురు కావటం.. అధికార పక్షం కాస్తా ప్రతిపక్ష స్థాయికి దిగిపోవటంతో మొన్నటి వరకు తిరుగులేని సారు.. ఇప్పుడు మాజీ ట్యాగ్ ను మోయలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు ముందు నుంచి గులాబీ బాస్ ను మాటలతో ఉతికి పారేసే.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో నిప్పులు చిమ్ముతారని అందరూ అంచనా వేశారు. అందుకు తగ్గట్లే.. గ్రౌండ్ రెఢీ అవుతున్న వేళ.. అనూహ్యంగా బాత్రూంలో జారి పడిన కేసీఆర్ దెబ్బకు సీన్ మొత్తం మారిపోయిందని చెప్పాలి.

తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై వరుస పెట్టి విరుచుకుపడాలని డిసైడ్ అయిన రేవంత్ సర్కారుకు సారు బాత్రూంలో జారి పడిన ఘటన సడన్ బ్రేక్ వేసింది. తొందరపాటుగా తీసుకునే నిర్ణయాలతో లేని ఇబ్బందులు ఏర్పడతాయన్న భావనతో తన జోరుకు బ్రేకులు వేసుకున్న పరిస్థితి. సాధారణంగా అధికారంలోకి వచ్చినంతనే కొంతకాలం సానుకూల వాతావరణం ఉంటుంది. రేవంత్ కు సానుకూలంగా కనిపిస్తూనే.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనట్లుగా చెప్పాలి.

చూస్తూ.. చూస్తూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం సాధ్యం కాదు. అలాఅని.. చూస్తూ ఊరుకోవటం కూడా ఫెయిల్యూర్ కిందకే వస్తుంది. అందుకే.. ఆచితూచి అన్నట్లుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రోజుకు రెండు.. మూడు కీలక అంశాల మీద.. శాఖల మీదా రివ్యూ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. అధికారం చేజారిన వేళ.. బాత్రూంలో జారి పడిన కేసీఆర్ కు మాత్రం.. సానుకూల వాతావరణాన్ని తెచ్చి పెట్టిందంటున్నారు.

ఎందుకుంటే.. మరో మూడు నెలల పాటు ఆయన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఆయనపై నేరుగా గురి పెట్టే అవకాశం ఉండదు. మూడునెలల తర్వాత.. సారుకు స్పందించే ఛాన్సు ఉంటుంది. అప్పటికే రేవంత్ సర్కారు ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలతో పాటు.. మూడు నెలల వ్యవధిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లోని లోపాల్ని ఎత్తి చూపేందుకు కేసీఆర్ కు అవకాశం లభిస్తుంది.మొత్తంగా చూస్తే.. బాత్రూంలో జారిపడిన ఘటన.. కేసీఆర్ కు బ్రీతింగ్ స్పేస్ ను ఇవ్వటమే కాదు.. తనపై ఎదురుదాడికి అవకాశం లేకుండా పోయిందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News