వామ్మో.. వందేళ్లుగా ప్రయోగం.. పూర్తికావాలంటే మరో వందేళ్లు..

ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ శాస్త్రవేత్తలు గత వందేళ్లుగా ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు. 1927లో థామస్ పార్నెల్ అనే ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త ఈ ప్రయోగాన్ని మొదలు పెట్టారు.

Update: 2024-11-20 15:30 GMT

ఏదేని ప్రయోగం చేపడితే అది నిమిషాల్లోనో.. గంటలోనో.. లేదంటే నెల రోజుల వ్యవధిలో పూర్తి కావడం సహజం. కొన్నికొన్ని సందర్భాల్లో నెలల సమయం తీసుకుంటుంది. ఎంత భారీ ప్రయోగాలు అయినా.. నెలల వ్యవధిలోనే పూర్తవ్వడం చూశాం. కానీ.. ఓ ప్రయోగం మాత్రం దశాబ్ద కాలంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. అవునండీ మీరు వింటున్నది నిజం. దశాబ్ద కాలం క్రితం మొదలుపెట్టిన ఓ ప్రయోగం ఇంకా కొనసాగుతున్నది అంటే నమ్మా్ల్సిందే.

ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ శాస్త్రవేత్తలు గత వందేళ్లుగా ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు. 1927లో థామస్ పార్నెల్ అనే ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త ఈ ప్రయోగాన్ని మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఈ ప్రయోగాన్ని యూనివర్సిటీకి చెందిన తరువాతి తరం శాస్త్రవేత్తలు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే.. ఈ ప్రయోగం పూర్తయ్యేందుకు మరో శతాబ్దకాలం పట్టే అవకాశం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే.. ఇది అత్యంత సుదీర్ఘ ప్రయోగంగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకోవడం గమనార్హం.

అసలు ఇంత సుదీర్ఘ కాలం చేసే ఈ ప్రయోగం ఏంటనేది అందరికీ ఆసక్తికరంగానే ఉంది. భౌతికశాస్త్రం ప్రకారం ఒక చోట నుంచి మరో చోటుకి ప్రవహించే వాటిని ఫ్లూయిడ్స్ అంటుంటారు. వీటిలో వాయువులు, మొదలు ద్రవాల వరకూ అనేకంగా ఉంటాయి. ప్రపంచంలో అత్యంత చిక్కనైన ఫ్లూయిడ్‌గా పేరుగాంచింది పిచ్ అనే పదార్థం. ఈ పదార్థంపైనే పార్నెల్ ఈ ప్రయోగం ప్రారంభించారు. చమురును శుద్ధి చేసే క్రమంలో ఉత్పత్తి అయ్యే టార్ నుంచి ఈ ద్రవాన్ని తయారు చేస్తుంటారు. ఫ్లూయిడ్స్‌కు ఉండే విస్కాసిటీతోపాటు ఇతర భౌతిక గుణాలనూ ముదింపు చేయాలని థామస్ ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు.

ఇంతకీ ఆ ప్రయోగాన్ని ఎలా చేశారో కూడా తెలుసుకుందాం. ఇందులో ముందుగా పిచ్‌ను ఓ గాజు గొట్టంలో పోశారు. ఫన్నెల్ చివర ఉన్న సన్నని గొట్టం నుంచి బొట్లుబొట్లుగా కారే పిచ్‌ను పరిశీలించి దాని భౌతిక గుణాలను కొలవాలి అనేది ఈ ప్రయోగం ముఖ్య లక్ష్యం. అయితే.. ప్రపంచంలోనే ఇది అత్యంత చిక్కటి ద్రవం కావడంతో ఫన్నల్ నుంచి తొలి బొట్టు పడేందుకు ఏకంగా ఎనిమిదేళ్లు పట్టిందట. ఆ తరువాత మరో ఐదు డ్రాప్స్ పడేందుకు మరో 40 ఏళ్లు పట్టింది. థామస్ పర్నెల్ తరువాత జాన్ మెయిన్‌స్టోన్ ఈ ప్రయోగాన్ని కంటిన్యూ చేశారు.

ఆయన తరువాత ఇతర శాస్త్రవేత్తలు ఈ బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. అయితే.. ఈ ప్రయోగం ప్రారంభించి 100 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఫన్నెల్‌లో తొమ్మిది చుక్కలు మాత్రమే కిందకు కారాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ పదార్థం ఎంత చిక్కగా ఉంటుందోనని. ఈ లెక్కల మరో వందేళ్లపాటు ఈ ప్రయోగం కొనసాగే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాగా.. ఇప్పటివరకు ఫన్నల్ నుంచి బొట్టు కింద పడుతుండగా చూసిన వారు కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం.

Tags:    

Similar News