మూడు సీట్లు పెండింగులో పెట్టిన జనసేన ...!

టీడీపీ నుంచి పొత్తులో భాగంగా తీసుకున్న 21 సీట్లలో మొత్తం 18 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు.

Update: 2024-03-25 03:36 GMT

టీడీపీ నుంచి పొత్తులో భాగంగా తీసుకున్న 21 సీట్లలో మొత్తం 18 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. కేవలం మూడంటే మూడు సీట్లను మాత్రం పెండింగులో పెట్టారు. ఆ జాబితాను ఆదివారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం చూస్తే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్. నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, రాజా నగరం నుండి బత్తుల బలరామకృష్ణ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలి సుందరపు విజయ కుమార్ ఉన్నారు.

అదే విధంగా చూస్తే పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, రాజోలు నుంచి దేవ వరప్రసాద్, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, తిరుపతి నుంచి అరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు నుంచి డాక్టర్ యనమల భాస్కరరావులను ప్రకటించారు.

ఇక మూడు సీట్లను జనసేన పెండింగులో పెట్టింది. ఆ సీట్లలో అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణం సీట్లు ఉన్నాయి. విశాఖ దక్షిణం సీటుని వైసీపీ నుంచి జనసేలోకి వచ్చిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ కి కేటాయించారని ప్రచారం సాగింది. దాంతో సౌత్ జనసేనలో చిచ్చు రేగింది. పార్టీ కోసం పనిచేసే లోకల్ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని అంతా కోరుతూ వచ్చారు. దాంతో అది పెండింగులో పెట్టారు.

అలాగే పాలకొండలో సీటు విషయంలో ఇంకా అభ్యర్ధి విషయంలో చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. ఈ సీటులో వైసీపీ బలంగా ఉంది. దాంతో గట్టి క్యాండిడేట్ కోసం చూస్తున్నారు అని అంటున్నారు. ఇక అవనిగడ్డ సీటు విషయంలో కూడా జనసేన నుంచి కొన్ని పేర్లు ఉన్నాయి. వాటిలో ఒకరిని ఖరారు చేస్తారు అని అంటున్నారు.

ఈ మొత్తం లిస్ట్ చూస్తే కనుక పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ అన్నది ఖాయం అయింది. అలాగే కీలక నేతలకు టికెట్లు దక్కాయి. అదే టైం లో ముందు నుంచి అనుకున్న చాలా మంది పేర్లు అయితే లేకుండా పోయాయి. దాంతో జనసేన వారికి సర్దిచెప్పుకొని లిస్ట్ ని మొత్తానికి రిలీజ్ చేసింది అని అంటున్నారు.

Tags:    

Similar News