టీఎస్‌పీఎస్సీ ప్లేస్ లో కొత్త కమిషన్.. సీఎం సంచలన నిర్ణయం

దీంతో నిరుద్యోగులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తరుచూ నిరసన తెలుపుతూనే ఉన్నారు.

Update: 2023-12-13 07:07 GMT

నీళ్లు, నిధులు, నియామకాలపై కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో దాదాపు పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదని అపవాదు మూటగట్టుకుంది. అడపా దడపా చిన్న చిన్న ఉద్యోగాలను అవి కూడా కాంట్రాక్ట్ బేస్ గానే ఇచ్చింది. దీంతో నిరుద్యోగులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తరుచూ నిరసన తెలుపుతూనే ఉన్నారు.

టీఎస్‌పీఎస్సీ చరిత్ర..

ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం ఏర్పాటైన సంస్థ టీఎస్‌పీఎస్సీ (తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) గతంలో ఈ సంస్థ పేర్లు మారుతూ వచ్చింది. విధి, విధానాలు ఒక్కటే అయినా మారుతూ వస్తోంది. నిజాం కాలం నుంచి వచ్చిన పబ్లిక్ కమిషన్. 1974లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీన్ని స్థాపించాడు. తర్వాత హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారెడ్డి దీన్ని హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మార్చాడు. ఇది దేశంలో ముందంజలో ఉంది. ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మార్చరు. ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా 2014, ఆగస్ట్ 18న ఏర్పడింది. మొదటి చైర్మన్ గా ఘంటా చక్రపాణి పని చేశారు.

టీఎస్‌పీఎస్సీ తరుఫున తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 2022లో ప్రకటించారు. ఆ మేరకు 90 వేలకు పైగా పోస్టులు అందులో 11 వేలకు పైగా క్రమబద్దీకరణ చేపడతామని హామీ శాసన సభ సాక్షిగా హామీ ఇచ్చారు. ఆ మేరకు ఉద్యోగార్థులు సిద్ధం అయ్యారు. గ్రూప్ పరీక్షలను నిర్వహించింది. కానీ పేపర్ లీక్ అంశం బయటకు రావడంతో వాటిని రద్దు చేసింది. ప్రస్తుతం బోర్డ్ చైర్మన్ గా ఉన్న జనార్దన్ రెడ్డి గవర్నర్ తమిళిసైకి తన రాజీనామాను సమర్పించగా ఆమె తిరస్కరించింది. పేపర్ లీక్ అంశం పూర్తిగా తేలకుండా రాజీనామాను అంగీకరించలేమిన గవర్నర్ కార్యాలయం పేర్కొంది.

యూపీఎస్సీగా మారునుందా?

టీఎస్‌పీఎస్సీ ను యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం (డిసెంబర్ 12) ఐఏఎస్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీఎస్‌పీఎస్సీ పూర్తిగా అవినీతి మయం అయ్యిందని గతంలో ఆరోపించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పూర్తి ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి వేగంగా టీఎస్‌పీఎస్సీని మార్చాలని చూస్తున్నారు. దీంతో పాటు పరీక్షల నిర్వహణ, నోటిఫికేషన్లపై అధికారులతో రివ్యూ నిర్వహించారు.

గతంలో సుప్రీ కోర్టు గైడ్ లైన్స్ మేరకే యూపీఎస్సీగా మారుస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల కమిషన్ల నిర్వహన, తీరు, విధి విధానాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. రేవంత్ ప్రభుత్వంలోనైనా ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు సైతం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా ఉద్యోగాల కల్పనలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నిరుద్యోగుల్లో కాస్తో, కూస్తో ఆనందం వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News