అంతర్జాతీయ `సెక్స్` రాజకీయం.. ఈ విషయాలు తెలుసా?
భారత్ వంటి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే దేశాల్లో అయితే.. మరింత గోప్యం. కానీ, ఇప్పుడు ఈ సెక్స్ అంశం.. అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశం అయింది.
సెక్స్.. వ్యక్తుల కుటుంబ జీవనంలో కీలక పాత్ర పోషించే ప్రధాన అంశం. ఓ వయసు వచ్చిన తర్వాత.. వివాహ బంధంతో ఒక్కటయ్యే జంట.. కుటుంబ జీవనంలోకి అడుగులు వేస్తారు. తద్వారా.. సెక్స్ ను అధికారికంగా తమ జీవితంలో భాగం చేసుకుంటారు. అయితే.. ఇది ఎప్పుడూ గోప్యంగా ఉండే అంశమే. భారత్ వంటి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే దేశాల్లో అయితే.. మరింత గోప్యం. కానీ, ఇప్పుడు ఈ సెక్స్ అంశం.. అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశం అయింది.
ప్రధానంగా గత రెండు రోజుల నుంచి కూడా.. కీలకమైన రెండు దేశాల్లో `సెక్స్` వ్యవహారం చర్చగా మారి.. అంతర్జాతీయ మీడియాను కుదిపేస్తోంది. అటు రష్యా, ఇటు అమెరికా.. రెండూ కూడా అగ్రరాజ్యాలే. అయితే.. ఈ రెండుదేశాల్లోనూ గత రెండుమూడు రోజులుగా సెక్స్‌పై అనేక వార్తలు, ఉద్యమాలు.. కూడా తెరమీదికి వచ్చాయి. దీంతో అసలు ఆయా దేశాల్లో సెక్స్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం ఏంటి? అసలు ఎందుకు ఇలా జరిగింది? అనేది ఆసక్తిగా మారింది.
రష్యాలో..
రష్యాలో దంపతుల మధ్య సెక్స్‌ను ఖచ్చితత్వం చేస్తూ.. అక్కడి పుతిన్ ప్రభుత్వం తీర్మానం చేసింది. అంతేకాదు.. సెక్స్ కోసం దంపతులు నిర్బంధ సమయం కేటాయించాలని కూడా ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇక, దంపతుల మధ్య శృంగారాన్ని పెంపొందించేందుకు, పిల్లలను కనేందుకు కూడా.. ఒక పర్యవేక్ష విభాగాన్ని ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేశారు. అక్కడితో కూడా ఆగకుండా.. ప్రధాన నగరాల్లో.. సెక్స్‌ను ప్రోత్సహించేందుకురాత్రి పది గంటల నుంచి తెల్లవారు జాము 4 వరకు గృహ విద్యుత్ సరఫరాను ఈ నెల 11వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు.
దీనికి కారణం.. ఉక్రెయిన్‌తో ఎడతెరిపి లేకుండా రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. తద్వారా.. దేశవ్యాప్తంగా మరణాలు పెరిగిపోయి.. జనభా సంఖ్య తగ్గిపోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేప థ్యంలోనే నిర్బంధ జననాలకు పుతిన్ సర్కారు పచ్చ జెండా ఊపింది. అందుకే.. శృంగారాన్ని ప్రోత్స హించే శాఖను, పర్యవేక్షించే విభాగాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. అయితే.. ఈ నిర్ణయంపై రష్యాలో ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి. సెక్స్ అనేది.. మానసికంగా జరిగే ప్రవర్తనను బట్టి.. ఉత్తేజమవు తుందని.. నిర్బంధాలతో కాదన్నది ప్రజాస్వామ్య వాదులు చెబుతున్న మాట.
అమెరికాలో..
అమెరికాలో మరో చిత్రమైన వ్యవహారం తెరమీదికి వచ్చింది. ఇక్కడ కుటుంబాల్లో సెక్స్ కు లోటు లేదు. కానీ, దీని వల్ల గర్భందాల్చే మహిళలు.. సంతానం పెరిగిపోతుందన్న ఆవేదనతో అబార్షన్ హక్కుల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఈ హక్కుకు బైడెన్ సర్కారు పచ్చ ఊపింది. కానీ, ఎన్నికల సమయంలో ట్రంప్.. ఈ హక్కును తాము తీసేస్తామన్నారు. ఇప్పుడు ఆయనే అధికారంలోకి వచ్చారు. జనవరి 20న పగ్గాలు చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో అబార్షన్ హక్కును కొనసాగిస్తామని ట్రంప్ హామీ ఇవ్వాలని మహిళలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఆ హక్కును సాధించుకునే వరకు.. నో సెక్స్-నో మ్యారేజ్ నినాదంతో ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు. సో.. ఇలా అంతర్జాతీయంగా ఈ రెండు దేశాలు సెక్స్ విషయంలో రాజకీయంగా చర్చనీయాంశం కావడం గమనార్హం.