.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

విశాఖ సీపీ: హానీమూన్ కు వెళ్లిన ప్లేస్ కు పోలీస్ బాస్!

సామాన్యుడికి చేరువుగా ఉంటూ.. వారి సమస్యల పరిష్కారం కోసం శ్రమించే అతి కొద్దిమంది పోలీసు ఆఫీసర్లలో ఒకరు.

Update: 2024-07-01 11:30 GMT

నీతికి, న్యాయానికి, నిలువెత్తు అద్దంగా నిలుస్తూ.. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గని పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారా? అంటే.. కొద్దిమంది ఉన్నారని చెప్పక తప్పదు. అలాంటి వారికి సరైన పోస్టింగులు పడవన్న పేరు ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు ఏపీకి చెందిన శంకబ్రత బాగ్చీ. డాక్టర్ కావాల్సింది యాక్టర్ అయ్యే మాటకు భిన్నంగా.. డాక్టర్ చదువు చదివి సివిల్స్ కొట్టాలన్న పట్టుదలతో ఐపీఎస్ సాధించిన బాగ్చీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలానే ప్రాంతాల్లో పదవులు చేపట్టారు.

సామాన్యుడికి చేరువుగా ఉంటూ.. వారి సమస్యల పరిష్కారం కోసం శ్రమించే అతి కొద్దిమంది పోలీసు ఆఫీసర్లలో ఒకరు. అలాంటి ఆయన్ను తాజాగా విశాఖపట్నం సీపీగా ఎంపిక చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఈ ఉక్కునగరంలో క్రైం బాగా పెరిగిపోయిన పరిస్థితి. ఒకప్పుడు ప్రశాంత జీవనానికి మారుపేరుగా ఉండే వైజాగ్ ఇటీవల కాలంలో తరచూ శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోంది. ఇలాంటి వేళ.. సీపీగా బాధ్యతలు చేపట్టారు శంకబ్రత బాగ్చీ.

Read more!

ఇక్కడ బాగ్చీ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పాలి. తనకు పోస్టింగ్ ఇచ్చిన ఏ చోటులో అయినా.. తన ఆఫీసులో ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్ లైన్ కాకుండా మరో ల్యాండ్ లైన్ ఫోన్ ఏర్పాటు చేసుకునేవారు. దీనికి కారణం.. ఇంటికి.. తెలిసిన వారికి ఫోన్ చేయాలంటే.. ఆ ఫోన్ నుంచి చేసేవారు. సదరు ఫోన్ బిల్ ను తన సొంత డబ్బుల నుంచి చెల్లించేవారు. అంతటి నిజాయితీపరుడు శంకబ్రత బాగ్చీ. గతంలో మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తిగత విషయాన్ని వెల్లడించారు.

పేరుకు ఐపీఎస్ అధికారి అయినప్పటికీ.. తన భార్యకు బంగారు గాజులు కొనిచ్చేందుకు దాదాపు పదేళ్లకు పైనే పట్టిందని చెప్పేవారు. అంతేకాదు.. తన వ్యక్తిగత పనులకు ప్రభుత్వం కల్పించిన వాహనాన్ని వాడని వ్యక్తిత్వం ఆయన సొంతం. అలాంటి ఆయన తాజాగా విశాఖ సీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.

వైజాగ్ లో పని చేయటానికి తనకు చాలా గర్వంగా ఉందన్న ఆయన.. ఇందుకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. తనకు వైజాగ్ తో ఉన్న అనుబంధం గురించి చెబుతూ.. ‘‘ నా పెళ్లి తర్వాత హనీమూన్ ఎక్కడకు వెళ్లాలన్న మాటలు వచ్చాయి. అప్పుడు అందరూ స్విట్జర్లాండ్ అన్నారు. కానీ నా దగ్గర అన్ని డబ్బులు లేవు. దీంతో విశాఖను ఎంచుకున్నాను. ఎందుకుంటే.. హిల్ స్టేషన్.. సముద్రం రెండూ ఉన్న ప్లేస్ కు తీసుకెళతానని నా భార్యకు మాట ఇచ్చాను. అన్నట్లే.. ఈ రెండు ఉన్న విశాఖకు అప్పట్లో వచ్చాం’’ అని చెప్పుకొచ్చారు.

కోల్ కతాకు చెందిన శంకబ్రత బాగ్చీ.. విధి నిర్వహణ విషయంలో చాలా కఠినంగా ఉంటారన్న పేరుంది. తనను కలిసేందుకు వచ్చే ఎవరికైనా ఒకేలాంటి మర్యాద ఇవ్వటం ఆయనకు అలవాటు. పేదవాళ్లను సైతం ఎంతో మర్యాదగా.. అప్యాయంగా పలుకరించే ఆయన.. చట్టానికి విరుద్ధంగా పని చేసే వారు ఎవరైనా సరే.. వారిపై చర్యలు తీసుకోవటానికి అస్సలు వెనుకాడరన్న పేరుంది. విశాఖ సీపీగా బాధ్యతలు చేపట్టిన వేళ.. సిటీ పోలీసులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. ‘ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. పబ్లిక్ తో ఎవరూ మిస్ బిహేవ్ చేయకూడదు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే గంజాయిని అరికడతాం’’అని వ్యాఖ్యానించారు. శంకబ్రత బాగ్జీ హయాంలో విశాఖలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.

Tags:    

Similar News