'ఎమ్మెల్యే అంటే'... జగన్ కు షర్మిల క్లాస్ పీక్స్!
వును... వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై ఒక పక్షం నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 (సోమవారం) ప్రారంభమైన సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు ఇవి! అయితే.. ఈ సమావేశాలకు హాజరుకావడం లేదని.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడమే దీనికి కారణం అని వైసీపీ అధికారికంగా ప్రకటించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో షర్మిల మరోసారి స్పందించారు.
అవును... వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై ఒక పక్షం నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వైసీపీ నేతలు అసెంబ్లీకి వెళ్లకూడదనే నిర్ణయాన్ని మొదటి నుంచీ తప్పుబడుతున్న ఏపీ పీసీ చీఫ్ షర్మిల మరోసారి తగులుకున్నారు! ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంటే ఏమిటో జగన్ కు చెప్పారు!
ఈ సందర్భంగా స్పందించిన షర్మిల... ప్రతిపక్ష హోదా లేకపోతే మైకు ఇవ్వరని అంటున్నారు.. మైకు ఇవ్వకపోవడం మీ స్వయం కృతాపరాథమే అని అన్నారు. ఒకప్పుడు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు.. ఈసారి 11 సీట్లకే పరిమితం ఎందుకు చేశారు?.. అని ప్రశ్నిస్తూ... మీ అక్రమాలు, అవినీతిని ప్రజలు గమనించారు కాబట్టే అని షర్మిల స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా... అసెంబ్లీకి పోను అనడం జగన్ అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనం అని చెప్పిన షర్మిల... ఈ గైర్హాజరీపై సమాధానం చెప్పాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే అంటే... మెంబర్ ఆఫ్ అసెంబ్లీ అని చెప్పిన షర్మిల.. మీకు ఆ ఆలోచన లేదా.. మీకు ప్రజలు ఓట్లు వేసింది అసెంబ్లీకి వెల్లడానికి కాదా అని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.
ఇదే సమయంలో జగన్ కు అయితే అహంకారం ఉంది.. మీకు ఏమైంది అని ప్రశ్నించిన షర్మిల... ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చి మాట్లాడటానికి కాదు కదా అని మరోసారి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఓ పక్క బడ్జెట్ ప్రవేశపెడుతుంటే.. ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఎవరు..? ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేది ఎవరు..? సర్కార్ దందాలను ప్రశ్నించేది ఎవరు..? అని నిలదీశారు!
ఈ సందర్భంగా... మీకు ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలంటూ వైసీపీకి లేఖ రాస్తునట్లు ప్రకటించిన షర్మిల... మీరు అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామాలు చేయాలని.. లేదంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలను లేవనెత్తాలని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల.