సీఎం రేవంత్‌తో షర్మిల భేటీ.. విషయం సీరియస్సేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా భేటీ అయ్యారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా భేటీ అయ్యారు. హైదరాబా ద్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన ఆమెకు రేవంత్ నుంచి సాదరస్వాగతం లభించింది. షర్మిలకు మొక్క ఇచ్చి.. శాలువా కప్పి.. రేవంత్ ఆహ్వాదంగా పలకరించారు. అయితే.. ఈ భేటీ ఇప్పుడు ఎందుకు? ఏంటి విషయం ? అనేది ఆసక్తిగా మారింది. ఒకవైపు ఇరు రాష్ట్రాల మద్య ఉన్న విభజన సమస్యలపై చర్చించు కునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమని ప్రకటించారు.
కలసి కూర్చుని మాట్లాడుకుందాం.. రండి! అంటూ.. తెలంగాణ సీఎం రేవంత్‌కు చంద్రబాబు లేఖ రాశా రు. దీనికి రేవంత్ కూడా సానుకూలంగానే స్పందించారు. ఈ నేపథ్యంలో రేపో మాపో.. ఇరువురు సీఎంలు కూడా.. ఒక దగ్గరకు చేరి.. చర్చించుకునే అవకాశం ఉంది. ఈ విషయం హాట్ హాట్‌గా సాగుతున్న క్రమంలో షర్మిల తెలంగాణలో ఎంట్రీ ఇవ్వడం.. సీఎం రేవంత్‌తో భేటీ కావడం చర్చకు దారితీసింది. ఎన్నికల సమయం నుంచి విబజన సమస్యలపై షర్మిల గళం వినిపిస్తున్నారు.
రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరుతున్నారు. ఇ లాంటి సమయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై చర్చించుకునే అవకాశం వచ్చింది. దీనిని ఆమె స్వాగతించేందుకు రేవంత్‌రెడ్డిని కలిసి వుంటారని.. తనకుఉన్న అనుభవాన్ని కూడా పంచు కునేందుకు ఆమె ఈ సమయాన్ని వినియోగించుకుని ఉంటారని పలువురు చెబుతున్నారు. అయితే.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే ఇక్కడ మరో విషయం కూడా.. ఉంది. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై షర్మిల ఒత్తిడి తెస్తున్నారు. ఎక్కడో ఉన్నబిహార్ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిందని.. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కూడా ఒత్తిడిచేయాలని షర్మిల కోరుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రత్యేక హోదా కోసం అడ్డు పడకుండా.. ముందుగానే ఆమె సెట్ చేసేందుకు రేవంత్‌రెడ్డిని కలిశారా? అనేది మరో చర్చ.
ఇక, ఇవన్నీ.. కాకపోయి ఉంటే.. ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని విజయవాడలో ఘనంగా చేసేందుకు షర్మిల ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిని అంగరంగ వైభవంగా చేసి.. తన సత్తాను నిరూపించుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి రేవంత్‌ను ఆహ్వానించేందుకు షర్మిల ఆయనను కలుసుకున్నారా? అనేది మరో కీలక చర్చ. మరి చూడాలి ఏది నిజమో!!